PM Modi: ఆ రెండు అంశాలపై మాత్రమే చర్చలు జరుగుతాయ్.. పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మాస్ వార్నింగ్..
ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మోదీ స్పష్టంచేశారు. లేదంటే శాంతికి వేరే ఏ మార్గం లేదన్నారు. టెర్రర్ - టాక్స్, టెర్రర్ - ట్రేడ్, ఇవి ఒకసారి కలిసి సాగలేవు.. ఉగ్రవాదం - చర్చలు, ఉగ్రవాదం - వాణిజ్యం ఒకేసారి కలిసి నడవలేవు అంటూ మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపాల్సి వస్తే.. ఉగ్రవాదంపై, POK పై మాత్రమే జరుగుతాయంటూ మోదీ స్పష్టంచేశారు.

ఆపరేషన్ సింధూర్‌లో ఇండియన్ ఆర్మీ కీలకంగా వ్యవహరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.. ఆపరేషన్ సిందూర్ అనంతరం.. ప్రధాని మోదీ తొలిసారిగా సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆర్మీకి సెల్యూట్ చేస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. బైసరన్‌లో కుటుంబసభ్యుల మధ్యే 26మందిని ఉగ్రమూక బలి తీసుకుందని.. మతం పేరుతో క్రూరంగా చంపిందని పేర్కొన్నారు మోదీ. మన తల్లుల బొట్టు చెరిపితే ఏం జరుగుతుందో చూపించామన్నారు. ఉగ్రవాదులను భారత క్షిపణులు, డ్రోన్‌లు హతమార్చాయన్నారు మోదీ. గ్లోబల్ టెర్రరిజానికి బహావల్పూర్ ఒక యూనివర్సిటీగా మారిందన్నారు. భారత్ చర్యలతో పాక్ నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిందన్నారు.
ఉగ్రవాద పోరులో భారత డ్రోన్లు, మిస్సైళ్లు టార్గెట్లు ఛేదించాయని.. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లపై బాంబుల వర్షం కురిపించాయని మోదీ అన్నారు. భారత్ దాడులతో ఉగ్రవాదులు బెంబేలెత్తిపోయారని.. కలలో సైతం భారత్ అంటే ఉలిక్కిపడేలా చేశామని తెలిపారు. తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించాం.. భారత త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయంటూ ప్రధాని మోదీ స్పష్టంచేశారు. భారత్‌పై మళ్లీ దాడిచేస్తే ముఖంపగిలే సమాధానంచెబుతామని హెచ్చరించారు. అణుబాంబుల పేరుతో మనల్ని ఎవరూ బెదిరించలేరన్నారు. ఉగ్రవాదాన్ని సహించం..కఠిన చర్యలు కొనసాగిస్తాం.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగిస్తామన్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ స్పష్టంచేశారు.
పాకిస్తాన్‌తో చర్చలు జరపాల్సి వస్తే.. ఉగ్రవాదం, పీవోకేపై మాత్రమే జరుగుతాయి-మోదీ
ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మోదీ స్పష్టంచేశారు. లేదంటే శాంతికి వేరే ఏ మార్గం లేదన్నారు. టెర్రర్ – టాక్స్, టెర్రర్ – ట్రేడ్, ఇవి ఒకసారి కలిసి సాగలేవు.. ఉగ్రవాదం – చర్చలు, ఉగ్రవాదం – వాణిజ్యం ఒకేసారి కలిసి నడవలేవు అంటూ మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపాల్సి వస్తే.. ఉగ్రవాదంపై, POK పై మాత్రమే జరుగుతాయంటూ మోదీ స్పష్టంచేశారు. బుద్ధపూర్ణిమ – బుద్ధ భగవానుడు శాంతి మార్గం ప్రబోధించాడు.. సైనిక బలగాలకు మరోసారి సెల్యూట్ చేస్తున్నానంటూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ముగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..