Operation Sindoor: అబ్ నహీతో కభీ నహీ.. ఆపరేషన్ సింధూర్ ముగియలేదంటే.. టార్గెట్ ఫిక్స్ అయినట్టే..
భారత్-పాక్ మధ్య సీజ్‌ఫైర్ అమల్లోకి వచ్చిన వెంటనే.. ఈ దేశ ప్రజల మదిలో మెదిలిన ప్రశ్న ఒక్కటే. ఏంటి.. పీవోకేను స్వాధీనం చేసుకోకముందే పాకిస్తాన్‌పై ప్రతిదాడులు ఆపేస్తున్నామా అని. యుద్ధ విరమణ అంటే విరామం మాత్రమే. యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినట్టు కాదు. అంటే.. పీవోకేను భారత్ స్వాధీనం చేసుకోవడం అనే ఆలోచన ఆగలేదు, పుల్‌స్టాపూ పడలేదు. మరైతే.. నెక్ట్స్ ఏం జరగబోతున్నట్టు? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను ఎలా సాధించుకోబోతున్నాం. బుల్లెట్ పేలకుండా, రక్తం చిందకుండా, యుద్ధం జరక్కుండానే పీవోకే మన సొంత అవబోతోందా? అంతర్గతంగా నడుస్తున్న చర్చ ఏంటి?

ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్‌తో పాటు, ఇటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలిపేస్తాం అని అన్నారు ఆనాడు. స్వయంగా మన పార్లమెంట్‌లోనే చెప్పారీ విషయం. ఆమధ్య కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఓ ఘాటు వ్యాఖ్య చేశారు. సరిహద్దు దాటి వచ్చి మరీ కొడతామని పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఆ డైలాగ్‌ను అక్కడితో ఆపలేదు. పీవోకేపై ఇక పాకిస్తాన్ ఆశలు వదిలేసుకోవాల్సిందేనని వార్నింగ్ కూడా ఇచ్చారు. లేటెస్ట్‌గా.. ఇప్పుడూ ఓ స్టేట్‌మెంట్ వచ్చింది. సరైన సమయంలో సరైన రీతిలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రధాన నరేంద్ర మోదీ. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని.. ఉగ్రవాదంపై పోరులో రాజీపడే ప్రసక్తే లేదని.. ఇక మిగిలింది పీవోకేనే అని కుండబద్దలు కొట్టారు. వీటన్నింటినీ డీకోడ్ చేస్తే తేలేదేంటంటే.. పీవోకేనే మన నెక్ట్స్ టార్గెట్. సంపూర్ణ జమ్ము కశ్మీర్ మన లక్ష్యం. ఇదే బాటమ్ లైన్. మరో ముచ్చటే లేదు. సంపూర్ణ జమ్ము కశ్మీర్ అంటే అర్ధం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం కూడా. ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే పాకిస్తాన్‌తో పాటు ప్రపంచానికి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది భారత్. నిజానికి.. 1994లోనే పీవోకేను స్వాధీనం చేసుకోవాలనుకుంది ఇండియా. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది మన పార్లమెంట్. సో,...