India-Pakistan: మారని పాకిస్తాన్ వక్రబుద్ధి.. జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ల కలకలం.. పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్..
భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వక్రబుద్దిని మరోసారి చూపించింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం.. మళ్లీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ లో పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి.. ఉధంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర డ్రోన్ల కదలికలను గుర్తించిన బలగాలు వెంటనే అప్రమత్తమై.. అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వక్రబుద్దిని మరోసారి చూపించింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం.. మళ్లీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ లో పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి.. ఉధంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర డ్రోన్ల కదలికలను గుర్తించిన బలగాలు వెంటనే అప్రమత్తమై.. అడ్డుకునే ప్రయత్నం చేశాయి. జమ్మూ కశ్మీర్ లోని నార్తర్న్ కమాండ్, ఉధంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిసరాల్లో బలగాలు 12-15 డ్రోన్ల కదలికను గుర్తించాయి.. అలాగే కట్రా ప్రాంతం నుంచి ఉధంపూర్ వైపు 5-7 డ్రోన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే.. అప్రమత్తమైన భద్రతా దళాలు.. జమ్మూ కశ్మీర్ లో బ్లాక్ అవుట్ చేశాయి.. అనంతరం పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.. అయితే.. సాంబాలో బ్లాక్‌అవుట్ మధ్య భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తాన్ డ్రోన్‌లను అడ్డుకుంటున్నప్పుడు ఎర్రటి గీతలు కనిపించాయి.. పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.. అనంతరం కొంత సేపటికి ఎలాంటి యాక్టివిటీ కూడా లేదని ట్వీట్ లో పేర్కొంది.
#UPDATE: After the first wave of drone activity and Air Defence fire. Now, No drone activity observed for the past 15 minutes in Samba. https://t.co/wsJnadZGvx
— ANI (@ANI) May 12, 2025
సాంబా సెక్టార్‌లో చాలా తక్కువ సంఖ్యలో డ్రోన్‌లు వచ్చాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మీ వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ముగిసిన చర్చలు..
భారత్, పాక్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలట్రీ ఆపరేషన్స్ మధ్య చర్చలు ముగిశాయి. సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం హాట్ లైన్ ద్వారా జరిగింది. వాస్తవానికి ఈ సమావేశం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరగాల్సింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరిన తర్వాత జరిగిన తొలి అధికారిక DGMO సమావేశమిది. దీనిలో కీలక నిర్ణయం తీసుకున్నారు. DGsMO ల సమావేశంలో ఇరుపక్షాలు ఎటువైపు నుంచి కాల్పులు జరపకూడదని నిర్ణయం తీసుకున్నాయి.. అలాగే.. ఒకరిపై ఒకరు దూకుడుగా, శత్రుత్వపూరిత చర్య తీసుకోకూడదనే నిబద్ధతను కొనసాగించడానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సరిహద్దులు, ముందుకు ఉన్న ప్రాంతాల నుండి బలగాలను ఉపహసంహరించేందుకు.. తక్షణ చర్యలు చేపట్టేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి..