AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: ఇది భారత్ సాధించిన విజయం.. అంతర్జాతీయ మీడియాలో ప్రధాన శీర్షికగా మారిన “మోదీ” చంద్రయాన్..

PM Modi In South Africa: చంద్రయాన్‌ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో.. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టిన కొన్ని నిముషాల్లోనే.. బెంగళూరులోని పర్యవేక్షణ కేంద్రంతో అనుసంధానమైంది. చంద్రుడి ఉపరితల ఫోటోలను కూడా పంపింది. ల్యాండర్‌ దిగుతున్న సమయంలో హారిజాంటల్‌ వెలాసిటీ కెమెరా తీసిన ఫోటోలనూ ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రుని ఉపరితలంపై చదునైన ప్రాంతాన్ని చంద్రయాన్‌ ల్యాండ్ అయిందని ఇస్రో తెలిపింది. ఈ విజయంపై భారత్ సాధిచిన విజయం అంటూ.. ప్రధానితోపాటు ఇస్రోపై అంతర్జాతీయ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది.

Chandrayaan 3: ఇది భారత్ సాధించిన విజయం.. అంతర్జాతీయ మీడియాలో ప్రధాన శీర్షికగా మారిన మోదీ చంద్రయాన్..
PM Modi In South Africa
Sanjay Kasula
|

Updated on: Aug 24, 2023 | 6:45 PM

Share

ప్రధాని మోదీ.. ఆయన ఎక్కుడున్న నా దేశం.. మా భారత్.. అంటూ అనుక్షణం తపిస్తుంటారు. అదే నిన్న కూడా జరిగింది.  తాను బ్రిక్స్ సభ్య దేశాలు సమావేశాల్లో ఉన్నా తమ ఇస్రో సాధించిన విజయాన్ని అధినేతలతో పంచుకున్నారు. అంతే కాదు ఈ ఉదయం అక్కడి పత్రికల్లో వచ్చిన వార్తలను అధినేతలతో కలిసి పంచుకున్నారు. భారతదేశం చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమవడంపై ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిక్స్ సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. అక్కడ కూడా భారతదేశ చరిత్ర సృష్టించినందుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రపంచ మీడియా చంద్రయాన్ 3 విజయాన్ని ప్రధాన శీర్షికగా ప్రచూరించాయి. దక్షిణాఫ్రికా వార్తాపత్రికలు సైతం చంద్రయాన్-3 మిషన్‌పై విజయంపై ప్రత్యేక కథనాలు ప్రచూరించాయి. అక్కడి ఆంగ్ల పత్రికలను ప్రధాని మోదీ చదువుతున్న ఓ చిత్రం సోషల్ మీడియాలో వచ్చింది.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం (ఆగస్టు 24) దక్షిణాఫ్రికా వార్తాపత్రిక హెడ్‌లైన్‌ను ప్రధాని మోదీ చదువుతున్న ఈ చిత్రాన్ని పంచుకున్నారు. ఇందులో ప్రధానమంత్రి వార్తాపత్రిక చదువుతూ నవ్వుతూ కనిపించారు. దక్షిణాఫ్రికా వార్తాపత్రిక ఆంగ్లంలో హెడ్‌లైన్‌ను పెట్టింది. “భారతదేశం ఈ ప్రపంచం నుంచి బయటపడింది.” ప్రధాని మోదీతో పాటు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా కూడా ఈ చిత్రంలో మనం చూడవచ్చు.

చంద్రయాన్-3 మిషన్‌కు అభినందనలు

భారతదేశం చంద్రయాన్-3 మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ అయినప్పుడు.. పీఎం మోదీ దక్షిణాఫ్రికా నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారానికి కనెక్ట్ అయ్యారు. దక్షిణాఫ్రికా వార్తాపత్రిక ఇస్రో,  మిషన్ చంద్రయాన్‌తోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ ప్రముఖంగా ప్రచూచించాయి.

చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా కూడా భారత్‌ అవతరించింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన వెంటనే.. ప్రధాని మోదీ జోహన్నెస్‌బర్గ్ నుంచి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు ఫోన్ చేసి.. అతనిని, అతని బృందాన్ని అభినందించారు.

సాధించిన విజయాన్ని ప్రధాని మోదీ..

జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సులో చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని ఒక దేశం పరిమిత విజయంగా భావించకుండా మానవజాతి సాధించిన ముఖ్యమైన విజయంగా భావించడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ఎల్లప్పుడూ ప్రపంచ సంక్షేమం కోసం పని చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి