AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబు సోరెన్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ.. సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్ళి శిబు సోరెన్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు.. ఈ మేరకు మోదీ ఎక్స్ లో ఫొటోలను షేర్ చేశారు.

PM Modi: జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబు సోరెన్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ..
PM Modi pays homage to Shri Shibu Soren
Shaik Madar Saheb
|

Updated on: Aug 04, 2025 | 3:11 PM

Share

జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూశారు.. అనారోగ్య సమస్యలతో గత కొంత కాలం నుంచి ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిబు సోరెన్ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో సోరెన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శిబు సోరెన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దీంతో పాటు ప్రధాని మోదీ.. సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్ళి.. శిబు సోరెన్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కల్పనా దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు.. ఈ మేరకు మోదీ ఎక్స్ లో ఫొటోలను షేర్ చేశారు.

‘‘శిబు సోరెన్ జీకి నివాళులర్పించడానికి సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్ళాను. నా ఆలోచనలు ఆయన కుటుంబం హేమంత్, కల్పనా, శ్రీ శిబు సోరెన్ జీ అభిమానులతో ఉన్నాయి.’’ అంటూ ట్వీట్ చేశారు.

శిబు సొరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఈ పోరాటంలో విజయం సాధించి మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారి 2005లో కేవలం 10 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. రెండోసారి 2008 నుండి 2009 వరకు…మూడోసారి 2009 నుండి 2010 వరకు జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా శిబు సొరెన్ ఉన్నారు. అలాగే దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో బొగ్గుశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కొడుకు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం