PM Modi: మూడో సారి బీజేపీదే అధికారం.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేసిన ప్రధాని మోదీ..
దేశ వ్యాప్తంగా వాతావరణంలో నెలకొన్న పరిస్థితులపై పీఎం మోదీ వాతావరణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాజాగా ముంగేష్‌పూర్‌లో గరిష్టంగా ఉష్ణోగ్రత 52.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఐఎండీ అధికారులు ఉత్తర భారతదేశంలో వేడిగాలుల పరిస్థితులు రానున్న రెండు రోజుల్లో తగ్గే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై పీఎం మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా వాతావరణంలో నెలకొన్న పరిస్థితులపై పీఎం మోదీ వాతావరణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాజాగా ముంగేష్‌పూర్‌లో గరిష్టంగా ఉష్ణోగ్రత 52.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఐఎండీ అధికారులు ఉత్తర భారతదేశంలో వేడిగాలుల పరిస్థితులు రానున్న రెండు రోజుల్లో తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అంతవరకూ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని ప్రధానికి వివరించారు. ఈ సంవత్సరం రుతుపవనాలు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై పీఎం మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీనిపై కూడా సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిస్థితులను చక్కబెట్టేందుకు అధికారుల, నిపుణుల సూచనలు సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా మరోసారి మోదీ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. దేశంలో 350కి పైగా స్థానాల్లో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.ఈ తరుణంలో మూడో సారి మోదీ ప్రధాని అవబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో మొదటి సెషన్ ఏర్పాటు చేసి తీసుకునే వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని భారీ స్థాయిలో జరుపుకునేందుకు సన్నాహకాలపై సమీక్షించింది. కురువును తట్టుకునేందుకు, అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు చేపట్టే ప్రయత్నాలు, ప్రణాళికలపై చర్చించింది. ఈ కార్యక్రమంలో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, డీజీ ఎన్‌డిఆర్‌ఎఫ్, మెంబర్ సెక్రటరీ, ఎన్‌డిఎంఎతో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..