AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pema Khandu Profile: అరుణాచల్‌లో కమలం వికసింపజేసిన పెమా ఖండూ ఎవరో తెలుసా..?

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యత సంపాదించింది. గత రెండు దఫాలుగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన పెమా ఖండూ ఈసారి కూడా అరుణాచల్ ప్రదేశ్‌‌లో కషాయం జెండా రెపరెపలాడబోతోంది. అయితే మూడోసారి సీఎం కాబోతున్న పెమా ఖండూ ఎవరో తెలుసా?

Pema Khandu Profile:  అరుణాచల్‌లో కమలం వికసింపజేసిన పెమా ఖండూ ఎవరో తెలుసా..?
Pema Khandu
Balaraju Goud
|

Updated on: Jun 02, 2024 | 12:33 PM

Share

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యత సంపాదించింది. గత రెండు దఫాలుగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన పెమా ఖండూ ఈసారి కూడా అరుణాచల్ ప్రదేశ్‌‌లో కషాయం జెండా రెపరెపలాడబోతోంది. అయితే మూడోసారి సీఎం కాబోతున్న పెమా ఖండూ ఎవరో తెలుసా?

పెమా ఖండూ భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి. 37 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఖండూ కంటే ముందు, అతి పిన్న వయసులో సీఎం అయిన ఏకైక సీఎం అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ తొలిసారి యూపీ సింహాసనాన్ని అధిష్టించినప్పుడు ఆయన వయసు 38 ఏళ్లు. అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ పెద్ద కుమారుడు పెమా. ఢిల్లీలోని హిందూ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

తండ్రి మరణం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

నిజానికి ఖండూ 2005లోనే రాజకీయాల్లోకి వచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కానీ అతని నిజమైన రాజకీయ ప్రయాణం అతని తండ్రి దోర్జీ ఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ప్రారంభమైంది. దీని తర్వాత పెమా 2011లో తన తండ్రి సొంత అసెంబ్లీ నియోజకవర్గం ముక్తో నుంచి ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఓట్లతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2014లో ముక్తో నుంచి అనూహ్యంగా గెలిచిన ఖండూ అరుణాచల్ ప్రదేశ్ జలవనరులు, పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ సీటు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయడం జరిగింది. పెమా ఖండూ చైనా సరిహద్దులోని తవాంగ్ జిల్లాలోని గ్యాంగ్‌ఖార్ గ్రామానికి చెందినవాడు. మోన్పా అనే తెగకు చెందిన ఖండూ అంచెలంచెలుగా ఎదుగుతూ మూడోవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

సీఎంగా ఉండగానే 43 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు

2016 సెప్టెంబరులో, పెమా ఖండూ అరుణాచల్ సీఎంగా ఉన్నప్పుడు, 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత బీజేపీ మిత్రపక్షమైన పీపీఏలో చేరారు. అయితే, డిసెంబర్ 2016లో, PPA ఆయనను పార్టీ నుండి తొలగించింది. ఆ తర్వాత పెమా ఖండూ 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత 2019లో పెమా ఖండూ నేతృత్వంలో అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024లో పెమా ఖండూ నేతృత్వంలో అరుణాచల్‌లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..