PM Modi: ‘తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం’.. ప్రజలకు ప్రధాని మోదీ, సోనియా శుభాకాంక్షలు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. దేశాభివృద్ధికి అందించిన సహకారం మరువలేనిది.. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు.. తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

PM Modi: ‘తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం’.. ప్రజలకు ప్రధాని మోదీ, సోనియా శుభాకాంక్షలు..
Sonia Gandhi and PM Narendra Modi
Follow us

|

Updated on: Jun 02, 2024 | 12:13 PM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. దేశాభివృద్ధికి అందించిన సహకారం మరువలేనిది.. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు.. తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘‘తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణం . గొప్ప చరిత్ర,విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం..’’ – నరేంద్ర మోదీ..

అమరవీరుల కలలను నెరవేర్చాలి.. సోనియా గాంధీ..

కాగా, పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి సీఎం రేవంత్ రెడ్డి వేడుకలను ప్రారంభించారు. అంతేకాకుండా రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై సోనియా వీడియో సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. తెలంగాణ అమరులకు శ్రద్ధాంజలి ఘటించిన సోనియా.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు. పదేళ్లలో తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గౌరవించారని.. ప్రజల కల నెరవేర్చే బాధ్యత తమపై ఉందన్నారు. అమరవీరుల కలలను నెరవేర్చాలి.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను.. రేవంత్‌ సర్కార్ అమలు చేస్తుందని ఆశిస్తున్నా అంటూ .. సోనియా వీడియో సందేశంలో పేర్కొన్నారు.

రాహుల్, ఖర్గే శుభాకాంక్షలు..

రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ట్విట్టర్ వేదికగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..