Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Schedule: 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ? మార్చి 7 కల్లా ఈసీ ప్రకటించే అవకాశం, ప్రధాని మోదీ వెల్లడి

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల కమిషన్ మార్చి  7 కల్లాతేదీలను   ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోదీ సూచనప్రాయంగా తెలిపారు..

Election Schedule: 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ?  మార్చి 7 కల్లా ఈసీ ప్రకటించే అవకాశం, ప్రధాని మోదీ వెల్లడి
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2021 | 2:52 PM

Election Schedule: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల కమిషన్ మార్చి  7 కల్లాతేదీలను   ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోదీ సూచనప్రాయంగా తెలిపారు. అలాగే మార్చి మొదటివారంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి కూడా తేదీని ఈసీ ప్రకటించవచ్చునన్నారు. 2016 లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను మార్చి 4 న ప్రకటించారని, ఈ ఏడాది బహుశా మార్చి 7 నాటికి  ఈసీ తేదీలను ప్రకటించవచ్చునని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో నిన్న పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. మార్ఛి మొదటివారంలో కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో మోదీ భారీ ర్యాలీ నిర్వహించనున్నారని, ఆ సందర్భంగా బెంగాల్ అసెంబ్లీకి పోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ పార్టీ 5 పరివర్తన్ యాత్రలు నిర్వహించింది. ఆరో యాత్ర వచ్ఛే నెల జరగవచ్చునని అంటున్నారు.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు తను మరిన్ని విజిట్లు చేయవచ్చునని మోదీ అన్నారు. అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో బాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాన్ని నేను త్వరలో సందర్శిస్తా .. తరచూ కేంద్ర మంత్రులు కూడా ఈ రాష్ట్రాలను విజిట్ చేయవచ్ఛు అన్నారు. అసోంలో 3 వేల కోట్ల వ్యయంతో చేపట్టే మూడు ఇంధన సంబంధ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ధీమాజీలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన..ఇదివరకటి ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం వెనుకబడిపోయిందన్నారు. అవి సవతి తల్లి ప్రేమను చూపాయని విమర్శించారు. దశాబ్దాల తరబడి  దేశాన్ని పాలించినవారు ఢిల్లీని, దిశా పూర్ ని దూరం చేశారని, దీనివల్ల ఈ రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని మోదీ పేర్కొన్నారు.

ఢిల్లీ ఇక మీకు ఎంతో దూరంలో లేదు.. మీ ఇంటి తలుపులవద్దే ఢిల్లీ నిల్చుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు పలువురు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తారని ఆయన చెప్పారు. నేను కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను.. ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటా అని ఆయన చెప్పారు. ప్రస్తుతం  ఈ రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వాన్ని మరింత పటిష్ట పరచవలసి ఉందన్నారు. ప్రజల ఆశీస్సులతో ఇక్కడ అభివృద్ధి వేగంగా జరిగేలా చూస్తామని మోదీ అన్నారు.

Also Read:

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ

Petro Prices: పెట్రోల్ పాపం యూపీఏదైతే.. డీజిల్ స్ట్రోక్ ఎన్డీయేది.. గత ప్రభుత్వాలేం చేశాయో తెలిస్తే షాకే!