PM Modi: కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భోపాల్‌లో బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో విమర్శలు
PM Modi on KCR Family: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుమార్తెకు మేలు జరగాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని , మీ కుటుంబానికి మేలు జరగాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలను కోరారు.
భోపాల్, జూన్ 27: కేసీఆర్ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురికి మేలు చేయాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయండి.. మీ కుటుంబం బాగుపడాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు. కుటుంబ పార్టీలపై భోపాల్ సభలో మోదీ నిప్పులు చెరిగారు. భోపాల్‌లో బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ ఈ విమర్శలు చేశారు. విపక్షాలన్నీ కలిసి రూ.10 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయని అన్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో “మేరా బూత్ సబ్సే శక్తి” కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భోపాల్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తిచేసుకుందని, లక్షలాది మంది బిజెపి కార్యకర్తల కృషి ఇందులో భాగమైందని అన్నారు.
భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. విపక్షాలకు ఓటేస్తే కుటుంబ పాలన వస్తుందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే గాంధీ కుటుంబానికి , ఎస్పీకి ఓటేస్తే ములాయం కుటుంబానికి , ఆర్జేడీకి ఓటేస్తే లాలూ కుటుంబానికి , బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్ కుమార్తె బాగుపడుతుందన్నారు మోదీ. విపక్ష నాయకుడి పేరును ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కామెంట్ చేయడం ఇదే మొదటి సారి.
భోపాల్‌లో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వం కవితకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం