PM Modi: ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యతారహిత ఆర్థిక విధానాలు.. ప్రజాకర్షక చర్యలు ఇచ్చే రాజకీయ ప్రయోజనాలు అనేవి కేవలం స్వల్పకాలమేనని అన్నారు. దీర్ఘకాలంలో మాత్రం ఆ రాష్ట్రాలు సామాజికి, ఆర్థికపరంగా భారీ ముల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జీ20 సదసస్సు జరగనున్న వేళ ప్రధాని మోదీ పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యతారహిత ఆర్థిక విధానాలు.. ప్రజాకర్షక చర్యలు ఇచ్చే రాజకీయ ప్రయోజనాలు అనేవి కేవలం స్వల్పకాలమేనని అన్నారు. దీర్ఘకాలంలో మాత్రం ఆ రాష్ట్రాలు సామాజికి, ఆర్థికపరంగా భారీ ముల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జీ20 సదసస్సు జరగనున్న వేళ ప్రధాని మోదీ పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతర్జాతీయ రుణసంక్షోభంపై అడిగనటువంటి ఒక ప్రశ్నకు ఈ విధంగా సమాధానమనిచ్చారు. అయితే దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించే పథకాల హామీలు ఇస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
చీఫ్ సెక్రటరీల జాతీయ సదస్సుతో పాటు వివిధ వేదికలపై కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బాధ్యతారహితంగా ఆర్థిక విధానాలను, ప్రజాకర్షక కార్యక్రమాలను స్వల్పకాలంలో రాజకీయంగా ఫలితాలు ఇస్తాయని చెప్పారు. కానీ అవి దీర్ఘకాలంలో ఆర్థిక మూల్యానికి దారితీస్తాయని అన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలు లేదా ఇప్పటికే వాటి నుంచి బయటపడిన దేశాలు.. తమ దేశాల్లో ఆర్థిక క్రమశిక్షణకు అధ్యతికంగా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాయని అన్నారు. అందుకే పలు రాష్ట్రాలు కూడా ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా అని స్పష్టం చేశారు. మరోవైపు ఇండియా అభివృద్ధిని ఎన్నో దేశాలు నిశితంగా పరిశీలన చేస్తున్నాయని.. ప్రధాని మోదీ అన్నారు. అలాగే సంస్కరణలు, వాటి అమలు, మార్పు.. ఆధారిత రోడ్‌మ్యాప్ వల్లే ఇది సాధ్యమవుతుందని చెప్పారు.
ఇదిలా ఉండగా ప్రపంచ చరిత్రలో సుధీర్ఘ కాలంగా భారత్ పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉండేదని.. కానీ వలసవాదం వల్లే ప్రపంచ వేదికపై వెనకబడిపోవడానికి కారణం అయ్యిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ పురోగమిస్తోందని.. ఇక 2047వ సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో నెగ్గేందుకు తమ ప్రణాళికలను రచిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. మరికొన్ని రోజులు జీ20 సమావేశాలు జరగనున్నాయి. అలాగే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంశం కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.