PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవసాయంలో పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సూచించారు. అన్నదాతలకు ఎంతో లాభాన్ని సమకూర్చే 109 రకాల వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ICAR) లో ఈ కార్యక్రమం జరిగింది.

PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..
Pm Modi
Follow us

|

Updated on: Aug 12, 2024 | 11:51 AM

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవసాయంలో పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సూచించారు. అన్నదాతలకు ఎంతో లాభాన్ని సమకూర్చే 109 రకాల వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ICAR) లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులతో భేటీ అయ్యారు. మోదీ మాట్లాడుతూ.. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా 109 రకాల పంటల వంగడాలను విడుదల చేసినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త విత్తనాలను విడుదల చేసినట్లు తెలిపారు. వ్యవసాయంలో పరిశోధన, ఆవిష్కరణలపై తన ప్రాధాన్యతను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి నినాదం “జై జవాన్, జై కిసాన్”.. తోపాటు అటల్ వాజ్‌పేయ్ నినాదం “జై విజ్ఞాన్” అనే నినాదాన్ని ఆయన గుర్తు చేశారు. పరిశోధన, ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ఈ పదబంధానికి “జై అనుసంధన్” కూడా జోడించాలని సూచించారు. కాగా.. రైతులతో మాట్లాడుతున్న క్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ప్రొటోకాల్ ను పక్కనబెట్టి..

కాగా.. రైతులతో మాట్లాడుతున్న క్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పూసా ఇవెంట్‌లో రైతులతో మాట్లాడేందుకు ప్రధాని వెళ్లినప్పుడు, భారీ వర్షం కురిసింది. ఇంటరాక్షన్‌ను రద్దు చేయాలని అధికారులు ప్రధానిని కోరారు.. అయితే వర్షం ఉన్నప్పటికీ రైతులతో సంభాషిస్తానని ప్రధాని పట్టుబట్టారు. ఇక.. గొడుగు పట్టుకునే విషయానికి వస్తే.. ప్రధాని తన గొడుగును తానే పట్టుకుంటానని సెక్యూరిటీకి చెప్పారు. అంతేకాకుండా రైతులకు కూడా గొడుగు పట్టేందుకు ప్రధాని మోదీ ముందుకొచ్చారు. కఠినమైన ప్రొటోకాల్ ఉన్నప్పటికీ.. ప్రధాని మోదీ రైతులతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం పట్ల పలువురు ఆయన సింప్లిసిటీని అభినందిస్తున్నారు.

వీడియో చూడండి..

వ్యవసాయ, ఉద్యానవన పంటల్లో అధిక దిగుబడినిచ్చే, రకరకాల వాతావరణల పరిస్థితిని తట్టుకునేలా ఈ బయోఫోర్డిఫైడ్ విత్తనాలను తయారు చేశారు. 109 రకాల వంగడాలలో 61 పంటల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ విత్తనాల్లో.. పొలాల్లో పండే పంటల విషయానికొస్తే.. మినుము, నూనెగింజలు, చిక్కుడు, చెరకు, పత్తి సహా ఇతర పంటలు ఉన్నాయి. అలాగే ఉద్యాన పంటల విషయానికొస్తే, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ పంటలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రైతులతో పాటు శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

పోషకాహార లోపం లేని భారతదేశాన్ని రూపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా బయో ఫోర్టిఫైడ్ రకాల పంటలను ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. చిరుధాన్యాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మోదీ వివరించారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రస్తుతం డిమాండ్‌ పెరిగిందని, ప్రజలు అటువంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యోగా చేస్తే నిద్రలేమి సమస్య దూరమవుతుందా.? ఇందులో నిజం ఎంతుంది..
యోగా చేస్తే నిద్రలేమి సమస్య దూరమవుతుందా.? ఇందులో నిజం ఎంతుంది..
కేజ్రీవాల్ ప్రకటనపై స్పందించిన అన్నా హజారే
కేజ్రీవాల్ ప్రకటనపై స్పందించిన అన్నా హజారే
టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లా జట్టు..
టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లా జట్టు..
చిన్నతనంలో మింగేసిన ఆట వస్తువు.. 26ఏళ్ల తర్వాత ముక్కుల్లోంచి ఇలా!
చిన్నతనంలో మింగేసిన ఆట వస్తువు.. 26ఏళ్ల తర్వాత ముక్కుల్లోంచి ఇలా!
స్వక్షేత్రం తులా రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త!
స్వక్షేత్రం తులా రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త!
ఇదెక్కడి కర్మ రా దేవుడా! గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయి వ్యక్తి మృతి
ఇదెక్కడి కర్మ రా దేవుడా! గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయి వ్యక్తి మృతి
దటీజ్ మోదీ.. ప్రపంచాన్ని మెప్పించిన లోకనాయకుడు..!
దటీజ్ మోదీ.. ప్రపంచాన్ని మెప్పించిన లోకనాయకుడు..!
సోయా తింటే కాన్సర్ రాదా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..!
సోయా తింటే కాన్సర్ రాదా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఖర్చుల భారాన్ని తగ్గించేలా..
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఖర్చుల భారాన్ని తగ్గించేలా..
సాలీడు కాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రికి వెళ్లగా.. షాకింగ్‌ నిజాలు
సాలీడు కాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రికి వెళ్లగా.. షాకింగ్‌ నిజాలు
ఎక్కడ చూసినా దేవర ఫీవర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్.?
ఎక్కడ చూసినా దేవర ఫీవర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్.?
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!