Watch: ఛాన్స్ దొరికితే వదిలిపెట్టరు..! వైసీపీకి ఆయనే బిగ్ వాయిస్

Watch: ఛాన్స్ దొరికితే వదిలిపెట్టరు..! వైసీపీకి ఆయనే బిగ్ వాయిస్

Janardhan Veluru

|

Updated on: Jan 15, 2025 | 10:45 PM

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జరిగిన జమిలి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సీనియర్లు చాలా మంది సైలెంట్ అయిపోయారు. కొందరు పార్టీ నుంచి జంప్ అయ్యారు. మరికొందరు పార్టీ నుంచి జంప్ అయ్యేందుకు సరైన టైమ్ కోసం చూస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే..

ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సీనియర్లు చాలా మంది సైలెంట్ అయిపోయారు. కొందరు పార్టీ నుంచి జంప్ అయ్యారు. మరికొందరు పార్టీ నుంచి జంప్ అయ్యేందుకు సరైన టైమ్ కోసం చూస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి బిగ్ వాయిస్‌గా మారారు. పార్టీ తరఫున బలంగా తన గళాన్ని వినిపిస్తూ.. ఛాన్స్ దొరికినప్పుడల్లా కూటమి ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఎలా అయితే ఆయన టీడీపీ, జనసేనపై నిత్యం విరుచుకపడేవారో.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఆయన తన సహజ ధోరణినే కొనసాగిస్తున్నారు.

అయితే ఆయనకు సరైన అడ్డా దొరకడం లేదన్నది ఉమ్మడి గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో అంబటి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారన్నది ఇప్పటికైతే సస్పెన్స్‌గానే ఉంది.

Published on: Jan 15, 2025 10:42 PM