తాలింపులో రెండు కరివేపాకు రెమ్మల్ని దూసి వేశామంటే- చిటపటమంటూనే ఘుమఘుమలతో వంటకం రుచీ అదిరిపోవాల్సిందే... కానీ తినేటప్పుడు మాత్రం ఆ ఆకుల్ని తీసి పక్కనపెట్టేస్తుంటాం
TV9 Telugu
కానీ అది చేసే మేలేంటో తెలుసుకున్నారంటే కరివేపాకే అని తీసిపారేయకుండా కాస్త ఆలోచనలో పడతారు. ఆడవాళ్ల దృష్టిలో కరివేపాకు వంటల్లో వేసే పదార్థమే కాదు, అదొక ఎమోషన్
TV9 Telugu
వంటకు సిద్ధంగా అన్ని పదార్థాలు ఉన్నా తాలింపులోకి కరివేపాకు లేదంటే మాత్రం ఎంతో వెలితిగా భావిస్తారు. అందుకే అప్పట్లో పెరట్లో అడుగుపెట్టగానే సువాసన వెదజల్లే కరివేపాకును పెంచుకుంటే, ఇప్పుడు వీలును బట్టి బాల్కనీ కుండీల్లోనూ పెంచుతున్నారు
TV9 Telugu
వాసనతోపాటు వంటకం రుచినీ పెంచే ఈ కరివేపాకు ఔషధగుణాలు దండిగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, సి, అనేక బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు, అనేక ఖనిజాలు, మొక్కల ఆధారిత యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
ముఖ్యంగా కరివేపాకును ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది చర్మ సమస్యలకు బలేగా పనిచేస్తుంది
TV9 Telugu
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు ఆకులను తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోయి చర్మం సహజంగా మెరుస్తుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో 7 నుంచి 10 కరివేపాకులు తింటే ఇలా నెల రోజుల్లోనే బరువు కూడా అదుపులో ఉంటుంది
TV9 Telugu
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును నమలడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరిచి, ఒత్తుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది
TV9 Telugu
మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడేవారికి కరివేపాకుకు మించిన రెమెడీ లేదు. మేలు చేస్తుంది. ఇది మంచి జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర నియంత్రణకు, ఆరోగ్యకరమైన గుండె లయకు ప్రయోజనకరంగా ఉంటుంది