Khammam: పత్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన పత్తి బస్తాలు

Khammam: పత్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన పత్తి బస్తాలు

Janardhan Veluru

|

Updated on: Jan 15, 2025 | 9:56 PM

ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యాపారులకు చెందిన సుమారు 1200 బస్తాల పత్తి కాలి బూడిదయ్యింది. దాదాపు రూ.70 లక్షల నష్టం వాటిల్లిందని అంచనావేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

ఖమ్మం పత్తి మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. షార్ట్ సర్క్యూట్ తో ఇద్దరు వ్యాపారులకు చెందిన సుమారు 1200 బస్తాల పత్తి దగ్ధం అయ్యింది. రూ. 70 లక్షలు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అధికార యంత్రాంగాన్ని సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు.పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌తో మాట్లాడటంతో ఇతర అధికార యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేశారు. మార్కెటింగ్, ఫైర్, పోలీస్‌ అధికారులు సంఘటన స్థలానికి వెళ్ళిన పూర్తి వివరాలు సేకరించారు..ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. సెలవు రోజుల్లో ఈ సంఘటన జరగటంపై వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి తుమ్మల ఆదేశించారు.