పాఠశాలలో మహిళా టీచర్ తో హెడ్మాస్టర్ రాసలీలలు.. వీడియో వైరల్
పిల్లలను సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలలో పాడు పనులకు పాల్పడ్డారు. ఇద్దరు ఉపాధ్యాయులు స్కూళ్లోనే అసభ్య కార్యకలాపాలు కొనసాగించారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలితో ఓ ఉపాధ్యాయుడి రాసలీలల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
టీచర్ల నిర్వాకంపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు వేశారు. పాఠశాల స్టాఫ్ రూమ్‌లో కొద్ది రోజులుగా సాగుతోన్న వీరి అసభ్య కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం, అత్యంత జుగుప్సాకరంగా ఉన్న దృశ్యాలు.. డీఈవో దృష్టికి రావడంతో తక్షణమే వారిని సస్పెండ్ చేశారు. పాఠశాలలో టీచరమ్మతో ఉపాధ్యాయుడి రాసలీలల వ్యవహారం వెలుగుచూడటంతో గ్రామస్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు నేర్పించాల్సిన చోట ఇలాంటి పనులేంటని మండిపడుతున్నారు. వీరిద్దరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అచ్ఛం మనిషిలాగే గాలిపటాన్ని ఎగరేసిన కోతి
మీ ఇంటి మెయిన్ డోర్‌కి నేమ్ ప్లేట్ పెట్టారా? తేడా వస్తే ఎంత డేంజరంటే
స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రూ.2.8 కోట్లు స్మార్ట్ గా కొట్టేశారు