Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంటి మెయిన్‌ డోర్‌కి నేమ్‌ ప్లేట్‌ పెట్టారా? తేడా వస్తే ఎంత డేంజరంటే

మీ ఇంటి మెయిన్‌ డోర్‌కి నేమ్‌ ప్లేట్‌ పెట్టారా? తేడా వస్తే ఎంత డేంజరంటే

Phani CH

|

Updated on: Jan 24, 2025 | 12:24 PM

సాధారణంగా చాలా మంది ఇంటి మెయిన్ డోర్ పై నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు. ఇంటి యజమాని పేరును గుర్తించేందుకు నేమ్‌ప్లేట్ పెడుతుంటారు. అయితే ఇంటి ప్రధాన ద్వారంపై అమర్చిన నేమ్‌ప్లేట్ అక్కడ ప్రవేశించే శక్తిని ప్రభావితం చేస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంటి ప్రధాన ద్వారంపై నేమ్‌ప్లేట్ ఉంచడం మంచిది కాదంటున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం మీద నేమ్‌ప్లేట్ పెట్టడం ఎందుకు నిషేధమో చూద్దాం. మెయిన్ డోర్‌కు నేమ్‌ప్లేట్ జత చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల, ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒక వ్యక్తి తన పేరును డోర్‌పై రాసుకున్నప్పుడు లేదా ఇంటి మెయిన్ డోర్‌పై నేమ్ ప్లేట్ పెట్టినప్పుడు ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తి ఆ వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందంటున్నారు నిపుణులు. ఇంటి ప్రధాన ద్వారంపై నామఫలకం పెట్టడం వల్ల వాస్తు దోషాలు పెరుగుతాయంటున్నారు. ఇంట్లోని ప్రతీ స్థలాన్ని ఏదో ఒక గ్రహం ఆక్రమించడం వల్ల ఇలా జరుగుతుందంటున్నారు. అలాగే ఇంటి వెలుపల ఉన్న ప్రదేశం రాహు గ్రహంచే ప్రభావితమవుతుంది. ఇంటి మెయిన్ డోర్ పై పేరు రాసుకున్నా, నేమ్ ప్లేట్ పెట్టినా కచ్చితంగా రాహువు ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మెయిన్ డోర్ పై నేమ్ ప్లేట్ పెట్టాలంటే మెయిన్ డోర్‌కు ఎడమ వైపున పెట్టుకోవచ్చంటున్నారు. అలాగే నేమ్‌ప్లేట్‌ను ప్రవేశ ద్వారం సగం ఎత్తులో ఉంచాలని, అదికూడా ఆకారం వృత్తాకారంగా లేదా త్రిభుజాకారంగా మాత్రమే నేమ్‌ బోర్డ్‌ ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రూ.2.8 కోట్లు స్మార్ట్ గా కొట్టేశారు

టీ తాగుదాం రమ్మని పిలిచి.. ఉన్నదంతా దోచి..

మార్స్‌పై రాత్రి.. ఎలా ఉంటుందో తెలుసా ??

రోజూ బెల్లం తింటే..కోపం తగ్గిపోతుందట..