స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రూ.2.8 కోట్లు స్మార్ట్ గా కొట్టేశారు
కర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపించిన దుండగులు.. దాంట్లో సిమ్ వేయగానే స్కామ్ చేశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.
కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని, మీరు స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అడ్రస్ అడిగి తెలుసుకున్న దుండగులు కొరియర్ లో నిజంగానే సెల్ ఫోన్ పంపించారు. కొత్త ఫోన్.. అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. తన పాత ఫోన్ లోని సిమ్ తీసి కొత్త ఫోన్ లో వేసి వాడడం మొదలుపెట్టాడు. సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్ లు, ఓటీపీలు వచ్చినా కొత్త ఫోన్ కావడం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు. అయితే, అప్పటికే ఆ ఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకున్న స్కామర్లు.. సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బ్యాంకు ఖాతా వివరాలు తస్కరించి పాస్ వర్డ్ లు మార్చేశారు. ఆపై అతడి ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల 80 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీ తాగుదాం రమ్మని పిలిచి.. ఉన్నదంతా దోచి..
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

