AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బిచ్చి మరీ జైలుకెళుతున్నారు! ఏమిటీ విచిత్రం?

డబ్బిచ్చి మరీ జైలుకెళుతున్నారు! ఏమిటీ విచిత్రం?

Phani CH
|

Updated on: Jan 24, 2025 | 12:28 PM

Share

ఎవరైనా జైలుకు వెళ్లాలంటే జంకుతారు. ఏదైనా కారణం చేత జైలుశిక్ష పడితే దాన్నుంచి తప్పించుకునేందుకు రకరాకులుగా ప్రయత్నిస్తుంటారు. కానీ అక్కడి మహిళలు మాత్రం జైలుకు వెళ్లేందుకు దొంగతనాలు చేస్తూ కావాలనే దొరికిపోతున్నారు. దీంతో అక్కడి గదులన్నీ వృద్ధులతో నిండి ఉన్నాయి. వారి చేతులు ముడతలు పడ్డాయి.

నడుములు వంగిపోయాయి. కొంతమంది నడిచేందుకు అవస్థలు పడుతున్నారు. మరికొందరు వాకర్స్‌ వాడుతున్నారు. వారికి అక్కడి సిబ్బంది సాయం చేస్తున్నారు. ఇదంతా చూసి అదేదో వృద్ధాశ్రమం అనుకుంటే మీరు పొరబడినట్టే. అది జైలు. జపాన్‌లోని అతిపెద్ద మహిళా కారాగారం. ఆ దేశంలోని వృద్ధ జనాభాకు ఈ జైలులోని పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. పేదరికం, ఒంటరితనం కారణంగా జపాన్‌లోని చాలామంది వృద్ధ మహిళలు బయట బతకలేక చిన్నచిన్న నేరాలు చేస్తూ జైళ్లకు వెళ్లేందుకు కూడా వెనకాడటం లేదు. మరికొంతమందికి సిరులు ఉన్నా బాగోగులు చూసుకునే దిక్కు లేక నెలకు 20-30 వేల యెన్‌ల వరకు చెల్లించి మరీ జైలుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. దీన్నిబట్టే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జైలు జీవితం గడిపాక బయటికి వస్తున్నవారి ప్రవర్తనలో పెద్దగా మార్పు రావడం లేదు. బయట వారి బాగోగులు చూసుకునే వ్యక్తులు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వారి సంక్షేమానికి చర్యలు చేపడుతున్నప్పటికీ పరిస్థితి మారలేదు. అయితే, ఈ సమస్య కొంతమందికి ఉపాధి మార్గంగా మారింది. వయసు పైబడిన వారి బాగోగులు చూసుకునే కేర్‌ టేకర్లకు అక్కడ భారీ డిమాండ్‌ ఏర్పడింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2040 నాటికి ఈ రంగంలో పని చేసేందుకు 2.72 మిలియన్ల మంది అవసరం పడనుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాఠశాలలో మహిళా టీచర్ తో హెడ్మాస్టర్‌ రాసలీలలు.. వీడియో వైరల్‌

అచ్ఛం మనిషిలాగే గాలిపటాన్ని ఎగరేసిన కోతి

మీ ఇంటి మెయిన్‌ డోర్‌కి నేమ్‌ ప్లేట్‌ పెట్టారా? తేడా వస్తే ఎంత డేంజరంటే

స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రూ.2.8 కోట్లు స్మార్ట్ గా కొట్టేశారు

టీ తాగుదాం రమ్మని పిలిచి.. ఉన్నదంతా దోచి..