అంతు చిక్కని వ్యాధి..ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..?
అదో విచిత్రమైన వ్యాధి. ఎందుకొస్తుందో తెలియదు. వచ్చినా అసలు లక్షణాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. ఓ ఇంట్లో ఒకరికి సోకిందన్న వార్త తెలిసేలోగా మరో ఇంట్లో మరో వ్యక్తికి ఇదే ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటి వరకూ ఈ వింత వ్యాధితో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊరు ఊరంతా కంటి మీద కునుకు లేకుండా, సరైని తిండి కూడా తినకుండా వెర్రెత్తినట్టుగా అయిపోతోంది. డాక్టర్లు వస్తున్నారు. ఏదో చెప్తున్నారు. వెళ్లిపోతున్నారు. బతికున్న వాళ్లని ఆంబులెన్స్‌లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. తోచిన వైద్యం చేస్తున్నారు. కానీ..ఇప్పటి వరకూ అసలు ఏం జరుగుతోందో అంతుపట్టడం లేదు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలోని బదాల్ గ్రామంలో దాదాపు రెండు నెలలుగా ఇదే పరిస్థితి. అంతా మిస్టరీ అని చెబుతున్నారు తప్ప..అసలు ఆ మిస్టరీ ఏంటో ఇప్పటి వరకూ తేలలేదు. ఏదో వైరస్ సోకుతోందని కొందరు..కాదు కాదు మరింకేదో ఉందని ఇంకొందరు. ఇలా ఎవరికి తోచింది వాళ్లు చెబుతున్నారు. అటు ప్రాణాలు పోతూనే ఉన్నాయి. హాస్పిటల్స్ అన్నీ అలెర్ట్ అయ్యాయి. మెడికల్ సిబ్బంది కూడా అప్రమత్తమైంది. కానీ...అసలు ఆ వ్యాధేంటో తెలిస్తే కదా..వాళ్లు ఏమైనా చేయగలిగేది.
ఇప్పటికి రెండు నెలలు గడిచిపోయాయి. కానీ..ఇప్పటి వరకూ ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు అధికారులు. ఏకంగా ఎపిడమాలజీ ఎక్స్‌పర్ట్‌లు రంగంలోకి దిగారు. వాళ్లు ఇప్పుడిప్పుడే అనాలసిస్ మొదలు పెట్టారు. అసలు ఈ అంతు చిక్కని వ్యాధి పేరు ఏంటా అని పరిశోధిస్తున్నారు. అయితే..వాళ్లు ఇప్పటి వరకూ కొన్ని శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌లలో టెస్ట్‌లు చేశారు. ఈ రిపోర్ట్‌లు చూస్తుంటే వాళ్లకే ఏమీ అర్థం కావడం లేదట. అందుకు ఓ కారణముంది. ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు…ఇందుకు కారణం బ్యాక్టీరియా లేదంటే వైరస్ అని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చేస్తారు. అదే అంచనాలతో ఈ టెస్ట్‌లు చేశారు. కానీ..ఈ రిపోర్ట్‌లలో ఎక్కడా బ్యాక్టీరియా కానీ..వైరస్ కానీ ఉన్నట్టు తేలలేదు.
వైరల్ వీడియోలు

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
