AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పాడుబడ్డ గోడను తనిఖీ చేస్తుండగా.. అతని సుడి తిరిగిపోయింది..!

సుడి ఉండాలి గానీ అదృష్టం ఏదో రకంగా వరిస్తుంది. కటిక పేదవాడిని సైతం రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మార్చేస్తుంది. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి సంఘటనలు ఎన్నో వైరల్‌ కావడం చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నెటింట తెగ వైరల్ అవుతోంది. పాడబడ్డ ఇంటిని మరమత్తు చేస్తుండగా ఓ వ్యక్తిని లక్షాధికారిని చేసింది.

Watch Video: పాడుబడ్డ గోడను తనిఖీ చేస్తుండగా.. అతని సుడి తిరిగిపోయింది..!
Treasure Found Behind The Pillar
Balaraju Goud
|

Updated on: Jan 24, 2025 | 3:45 PM

Share

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర వార్తలు వింటుంటాం..అదృష్టం వరించడంతో కటిక పేదవాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిన సంఘటనలు వైరల్‌ కావడం చూస్తుంటాం. అలాగే, కోటీశ్వరులు దివాలా తీయడం వంటి ఘటనలు కూడా వింటుంటాం..అందుకే అదృష్టం ఎప్పుడు ఎలా ఎవ‌రి త‌లుపు తడుతుందో చెప్పలేం. అన్ని రోజులు ప‌డిన క‌ష్టం మొత్తం ఒక్క రాత్రితో ప‌టాపంచ‌లైపోతుంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రిగాయి. అందులో ఇదికూడా ఒక‌టి. పాడుబడ్డ ఇంటిని మరమ్మత్తు చేస్తుండగా ఓ వ్యక్తిని అనుకోకుండా లక్ష్మీదేవి వరిస్తుంది. దాంతో అతని దశ తిరిగి అతడు ధనవంతుడు అవుతాడు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి మెటల్ డిటెక్టర్‌తో పాడబడ్డ ఇంట్లోకి ప్రవేశించాడు. భయపడుతూనే లోపలికి వెళ్లాడు. గోడల్లో ఏదైనా నిధి దాగి ఉందో లేదో తెలుసుకోవడానికి అతను మెటల్ డిటెక్టర్‌తో గోడను స్కాన్ చేస్తున్నాడు. ఇంతలో, అతను ఒక ఫిల్లర్ దగ్గర మెటల్ డిటెక్టర్‌ని తీయగానే, దాని నుండి బీప్-బీప్ సౌండ్ రావడం మొదలైంది. అప్పుడు ఏం జరిగిందో చూస్తే, మీరు కూడా ఆశ్చర్యపోతారు. వీడియో చూడండి..

వీడియో చూశారుగా.. పాడబడ్డ ఇంట్లోని ఫిల్లర్ స్కాన్ చేసిన చోట ఆ వ్యక్తి మార్క్ చేశాడు. మెల్లగా గొడ పగులగొట్టడంతో మొదట పర్స్ కనిపించింది. ఆ తర్వాత లోపల నుండి ఒక మెటల్ కుండ బయటకు వచ్చింది. అందులో దాచిన చాలా డాలర్లు బయటపడ్డాయి. అంతే కాకుండా, చెవిపోగులు అందుబాటులో ఉన్నాయి. మొత్తంమీద, వైరల్ అయిన క్లిప్‌లో, సదరు వ్యక్తి ఏకంగా లక్షలకు యజమానిగా మారడం కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @jackcharlesefaiscaతో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది.

అయితే, దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీడియోలో చూపిన నిధి ప్రామాణికతను నమ్మడం కష్టం. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో అసాధ్యం ఏమీ లేదు. ఇది కూడా స్క్రిప్ట్ చేసి ఉండవచ్చని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో పోస్ట్‌లో చాలా మంది తమ భయాన్ని వ్యక్తం చేశారు. ఇది నిజమని అంగీకరించినా, తేమతో కూడిన ప్రదేశంలో కూడా నోటు పూర్తిగా ఎలా సురక్షితం అని కొందరు అంటున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..