నీకిదే కరెక్ట్ గురూ! అనవసరంగా హారన్ కొడితే ఇదే శిక్ష!వీడియో
రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు కొందరు ఊరికే హారన్ కొడుతూ ఉంటారు. ఇక ట్రాఫిక్ జామ్ అయితే చెప్పనక్కర్లేదు. ఎదుటి వాహనం కదిలే వరకూ హారన్ మోగిస్తూనే ఉంటారు. అలా అనవసరంగా హారన్ మోగిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న ఓ డ్రైవర్‌కి సరైన బుద్ధి చెప్పారు పోలీసులు. ఏదైనా వాహనాల హారన్ ఎదుటివాళ్లకు వినిపించేలా ఉండాలి. అంతేకాని వారి గుండె ఆగిపోయేలా కాదు. అలా చేయడం న్యూసెన్స్. అంతేకాదు ఇతర వాహనదారులు తత్తరపాటుకు గురై ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.
అందుకే ఇలా బిగ్గరగా హారన్ పెట్టుకుని వాహనదారులను విసిగిస్తున్నవారికి వినూత్న పనిష్మెంట్ ఇచ్చారు కర్నాటక ట్రాఫిక్ పోలీసులు.భయంకరంగా హారన్ మోగిస్తూ ఇతర వాహనదారులను, పాదచారులను ఇబ్బంది పెడుతున్న ఓ డ్రైవర్‌ను అదే బస్సు ముందు కూర్చోబెట్టి హార్న్ వినిపించారు. దీంతో సదరు డ్రైవర్ ఆ సౌండ్ భరించలేక అల్లాడిపోయాడు. గట్టిగా చెవులు మూసుకున్నాడు. నన్ను వదిలేయండి సార్ మీకు దణ్ణం పెడతాను అంటూ వేడుకున్నాడు. నువ్వు హారన్ కొట్టినప్పుడు ఎదుటివ్యక్తులు కూడా ఇలాంటి ఇబ్బందులకే గురవుతారు. అంత భారీ సౌండ్‌తో హారన్ కరెక్ట్ కాదని అర్ధమైందా అంటూ.. ప్రాక్టికల్‌గా చూపించారు పోలీసులు. దీంతో పోలీసులను ప్రశంసిస్తూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పోలీసుల ఆపరేషన్ సూపర్.. తను నడిపే బస్సు ముందే కూర్చొపెట్టి హారన్ కొట్టి బుద్ది చెప్పడం అదుర్స్ అని కొందరు వ్యాఖ్యానించారు. ఇలా అన్ని రాష్ట్రాల్లో చేస్తే బాగుంటుందని.. వాహనాల్లో ప్రయాణించే చిన్న పిల్లలు, వృద్ధులు శృతిమించిన హారన్ సౌండ్స్ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
