రికార్డు స్థాయిలో మంత్రాలయం హుండీ ఆదాయం
మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి హుండీ ఆదాయం రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతోంది. ధనుర్మాసంలో గురు రాఘవేంద్రస్వామివారి మఠాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు. ఈ క్రమంలో కేవలం ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో హుండీకి ఆదాయం సమకూరింది. ఏకంగా రూ.4 కోట్ల 80 లక్షల 33 వేల వచ్చి నట్టు మఠం అధికారులు తెలిపారు.
స్వామివారి మఠానికి కేవలం భారత దేశం నుంచే కాకుండా దేశవిదేశాలనుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో విదేశీ నగదు కూడా హుండీలో భారీగానే చేరుతోంది. బంగారం, వెండి కూడా పెద్ద మొత్తంలో సమర్పించారు భక్తులు. 2024 డిసెంబరు నెల 8 రోజులతో పాటు 2025 జనవరి 22 వరకు సంబంధించిన 30 రోజుల హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ ఇనస్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలను లెక్కించినట్లు తెలిపారు. రూ.4,80,33,154 నగదుతో పాటు 1780 గ్రాముల వెండి, 42 గ్రాముల 270 మిల్లిగ్రాములు బంగారం, వివిధ దేశాల డాలర్లు వచ్చినట్లు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క ఆధారం కూడా లేకుండా.. పకడ్బందీగా దారుణం
ధనుష్ అలా మాట్లాడేసరికి షాకయ్యా
రూ.30 కోట్ల బడ్జెట్! రూ.100 కోట్ల కలెక్షన్స్! ఈ హిట్ సినిమా OTTలో…
Prabhas: వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న డార్లింగ్.. మళ్లీ మారిన ప్రభాస్ లైనప్
RGV: ఆర్జీవీకి బిగ్ షాక్.. 3 నెలల జైలు శిక్ష
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు

