PM Kisan: ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితా.. చెక్ చేసుకోండిలా..!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 9వ విడత డబ్బులు నిన్న (సోమవారం ఆగస్టు 9) పీఎం మోడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి సొమ్ములు జమ అయిపోయాయి.
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 9వ విడత డబ్బులు నిన్న (సోమవారం ఆగస్టు 9) పీఎం మోడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి సొమ్ములు జమ అయిపోయాయి. అయితే, ఈ సొమ్ములు తమ ఖాతాలోకి జమ అయ్యాయా లేదా ఎలా తెలుసుకోవాలనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అందుకే మీకోసం ఇక్కడ కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులను ఎలా తెలుసుకోవాలి అనే అంశంపై పూర్తి వివరాలు అందిస్తున్నాం. ఈ వివరాలతో రైతులు ఇంట్లో కూర్చొని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితా తనిఖీ ఇలా..
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేయడానికి, మీరు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- మీరు పేజీలోకి వచ్చిన తర్వాత, మీరు “పీఎం కిసాన్ కింద లబ్ధిదారుల జాబితా” విభాగానికి వెళ్లాలి.
- ఇక్కడ ఈ వివరాలను నమోదు చేయండి – రాష్ట్రం పేరు, జిల్లా పేరు, ఉప జిల్లా, బ్లాక్ పేరు, గ్రామం.
- ఈ పైన పేర్కొన్న వివరాలను నమోదు చేసిన తర్వాత, మీరు “నివేదిక పొందండి” పై క్లిక్ చేయాలి.
పీఎం సమ్మాన్ కిసాన్ స్థితి తనిఖీ ఇలా..
- మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల స్థితిని తనిఖీ చేయాలనుకుంటే, మీరు ఇక్కడ క్లిక్ చేయండి.
- మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల స్థితిని మూడు విధాలుగా తనిఖీ చేయవచ్చు – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య అదేవిధంగా మొబైల్ నంబర్ ఆధారంగానూ తనిఖీ చేయవచ్చు.
- దీనిలో మీరు ఎలా తనిఖీ చేసుకోవాలనే ఎంపికను ఎంచుకోండి, మీరు ఆధార్ నంబర్ లేదా ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
- వివరాలను నమోదు చేసిన తర్వాత, మీరు “డేటాను పొందండి” పై క్లిక్ చేయాలి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధియోజన 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 9 వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేశారు. రూ. 19,500 కోట్లకు పైగా నేరుగా 9.75 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల ఖాతాల్లోకి బదిలీ అయినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
పీఎం కిసాన్ యోజన – మీరు తెలుసుకోవలసినది
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ పథకం అర్హత కలిగిన లబ్ధిదారు రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6000 ఆర్థిక ప్రయోజనం, ప్రతి మూడు సమాన 4-నెలవారీ వాయిదాలలో రూ. 2000 చొప్పున ఇస్తుంది. ఈ సొమ్ములు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతాయి.
Also Read: కోవిడ్ చలాన్లు జారీ చేస్తున్న అధికారులపై ఇద్దరు మహిళల దాడి.. జుట్టు పట్టుకుని..రచ్చ..రచ్చ
ఎదురు కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, వయాగ్రా స్వాధీనం.