AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: హలో రైతన్న.. ఇది నీకోసమేనన్నా.. ఫిబ్రవరి 10లోపు ఆ పని చేస్తేనే అకౌంట్లో డబ్బులు.. లేదంటే నిరాశే..!

PM Kisan Samman Nidhi Updates: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) లబ్ధిదారులకు అలర్ట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. ఈ పథకానికి మీరు కూడా అర్హులైతే..

PM Kisan: హలో రైతన్న.. ఇది నీకోసమేనన్నా.. ఫిబ్రవరి 10లోపు ఆ పని చేస్తేనే అకౌంట్లో డబ్బులు.. లేదంటే నిరాశే..!
Pm Kisan Update
Shiva Prajapati
|

Updated on: Feb 09, 2023 | 6:05 AM

Share

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) లబ్ధిదారులకు అలర్ట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. ఈ పథకానికి మీరు కూడా అర్హులైతే.. ఫిబ్రవరి 10వ తేదీ చాలా కీలకమైనదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ 13వ విడత నిధుల కోసం ఎదరుచూస్తున్నారు. అయితే, హోలీ కంటే ముందే ప్రభుత్వం ఈ విడతలో రూ. 2000 రైతుల ఖాతాలకు జమ చేసేందుకు ఏర్పట్లు చేసింది. అయితే, ఇందుకోసం రైతులు కేవైసీ చేయాల్సి ఉంది. అది చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.

తదుపరి విడత కోసం వెరిఫికేషన్..

పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులు ఫిబ్రవరి 10 లోపు వారి బ్యాంక్ ఖాతా e-KYC ధృవీకరించబడాలి. తదుపరి విడత డబ్బును పొందాలంటే కేవైసీ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం.. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు ఇ కేవైసీ, బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. 13వ విడత నిధులు పడాలంటే.. ఫిబ్రవరి 10 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..