PM Modi in Gujarat: గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ.. నేడే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..
గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు (సెప్టెంబర్ 30) గాంధీనగర్ నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు (సెప్టెంబర్ 30) గాంధీనగర్ నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు గురువారం ప్రధాని మోడీ చేరుకున్నారు. ప్రధాని గుజరాత్ పర్యటన సూరత్ నుంచి ప్రారంభమైంది. సూరత్‌తోపాటు భావ్‌నగర్, అహ్మదాబాద్‌లలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అహ్మదాబాద్‌లో తన పేరిట ఉన్న స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను ప్రారంభించారు. శుక్రవారం గాంధీనగర్ – ముంబై మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అహ్మదాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రారంభ పనులను కూడా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన మెట్రోలో ప్రయాణించనున్నారు.
రైలులో ప్రయాణించనున్న ప్రధాని..
గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రయాణించనున్నారు. గాంధీనగర్ స్టేషన్‌లో ఈ రైలును ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ రైలు నుంచి కలుపూర్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణిస్తారు. అదే సమయంలో అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును జెండా ఊపి ప్రారంభించిన తర్వాత కలుపూర్ స్టేషన్ నుంచి దూరదర్శన్ కేంద్ర మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో కూడా ప్రయాణించనున్నారు. అంబాజీలో 72 వందల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవం చేయనున్నారు. వీటిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 45 వేలకు పైగా ఇళ్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కూడా ఉన్నాయి. ప్రధాన్ మంత్రి ప్రసాద్ యోజన కింద, టార్గా హిల్-అంబాజీ-అబు రోడ్ కొత్త బ్రాడ్ గేజ్ లైన్ శుంకుస్థాపన, అంబాజీ దేవాలయం వద్ద తీర్థయాత్ర సౌకర్యాల అభివృద్ధి పనులు ఉన్నాయి.
ప్రధానమంత్రి శుక్రవారం షెడ్యుల్ ఇలా..
- గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గాంధీనగర్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు.
- ఉదయం 11.30 గంటలకు అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. మెట్రో స్టేషన్‌లోని కలపూర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
- అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీలో మధ్యాహ్నం 12.30 గంటలకు అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని ప్రారంభిస్తారు.
- సాయంత్రం 6.45 గంటలకు అంబాజీలో 72 వందల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.
- ప్రధాని సాయంత్రం 7 గంటలకు అంబాజీ ఆలయంలో దర్శనం, పూజలు చేస్తారు.
- రాత్రి 8.45 గంటలకు అంబాజీలోని గబ్బర్ తీర్థంలో జరిగే మహా హారతికి ప్రధాని హాజరవుతారు.
Vande Bharat 2.0: All set to serve the people of Gujarat and Maharashtra
Catch glimpses of the next-gen Vande Bharat Express to be flagged off by Hon’ble PM Shri @narendramodi today from Gandhinagar Capital Railway Station. pic.twitter.com/GWK9Ek1DfG
— Ministry of Railways (@RailMinIndia) September 30, 2022
సౌకర్యాలు ఇవే..
సౌకర్యవంతమైన సౌకర్యాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను తీర్చిదిద్దారు. కొత్తగా తయారు చేసిన సెమీ-హై స్పీడ్ రైలు రెండు రాజధానుల మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలు గురించి పశ్చిమ రైల్వే జోన్ CPRO సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నతమైన సౌకర్యాలను అందిస్తుందన్నారు. ప్రయాణీకులకు సౌకర్యవంతంగా.. అధునాతన అత్యాధునిక భద్రతా సదుపాయాలతో సేవలు అందిస్తుందన్నారు. కవాచ్ టెక్నాలజీ – స్వదేశీంగా అభివృద్ధి చేసిన రైలు ఢీకొనకుండా ఉండే వ్యవస్థ కూడా ఉన్నట్లు తెలిపారు. రైలు 160 kmph ఆపరేషనల్ స్పీడ్ కోసం పూర్తిగా సస్పెండ్ చేసిన ట్రాక్షన్ మోటార్లు కలిగిన బోగీలను అందుబాటులోకి తెచ్చామన్నారు. అత్యాధునిక సస్పెన్షన్ సిస్టమ్‌తో పాటు ప్రయాణీకులకు సాఫీగా, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తామన్నారు. అన్ని తరగతులలో రిక్లైనింగ్ సీట్లు, ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలో 180-డిగ్రీల రొటేటింగ్ సీట్ల సౌకర్యం ఉందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..