Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ పేలుళ్లపై ఎన్ఐఏ దర్యాప్తు.. స్టిక్కీ బాంబులు ఉపయోగించినట్లు అనుమానాలు..

జమ్ముకశ్మీర్‌ లోని ఉద్దంపూర్‌లో రెండు బస్సుల్లో జరిగిన పేలుళ్లపై NIA చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాదులు స్టిక్కీ బాంబులు ఉపయోగించినట్టు అనుమానిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో కుట్రకు తెరతీశారు. స్టిక్కీ..

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ పేలుళ్లపై ఎన్ఐఏ దర్యాప్తు.. స్టిక్కీ బాంబులు ఉపయోగించినట్లు అనుమానాలు..
Nia
Follow us

|

Updated on: Sep 30, 2022 | 9:25 AM

జమ్ముకశ్మీర్‌ లోని ఉద్దంపూర్‌లో రెండు బస్సుల్లో జరిగిన పేలుళ్లపై NIA చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాదులు స్టిక్కీ బాంబులు ఉపయోగించినట్టు అనుమానిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో కుట్రకు తెరతీశారు. స్టిక్కీ బాంబులతో మారణహోమానికి కుట్ర చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జమ్ముకశ్మీర్‌ పర్యటనకు రెండు రోజుల ముందు ఈ పేలుళ్లు జరగడం కలకలం రేపింది. ఉధంపూర్‌ పేలుళ్లపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోంది. ఎన్‌ఐఏ బృందాలు పేలుళ్లు జరిగిన బస్సులను పరిశీలించాయి. ఏ పేలుడు పదార్ధాలు ఉపయోగించారన్న విషయంపై దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి.

ఉద్దంపూర్‌లో 8 గంటల వ్యవధిలో రెండు బస్సుల్లో పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. పేలుళ్లలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కాగా.. జమ్ము కశ్మీర్‌ ను వరస బాంబు పేలుళ్లు వణికించాయి. బుధవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనలు తీవ్ర కలకలం సృష్టించింది. ఉధంపూర్‌ లో ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించింది. దొమాయిల్‌ చౌక్‌లోని ఓ పెట్రోల్‌ పంప్‌ సమీపంలో బుధవారం రాత్రి 10.30 సమయంలో బస్సును పార్క్ చేశారు. బస్సులో డ్రైవర్, మరో వ్యక్తి ఉన్నారు. ఈ బస్సు నిత్యం ఉధంపూర్‌-రామ్‌ఘర్‌-బసంత్‌ఘర్‌కు ప్రయాణికులను చేరవేస్తోంది. ప్రయాణీకులను దింపి వచ్చిన తర్వాత బస్సును నిలిపి ఉంచారు. ఆ సమయంలోనే బస్సులో పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో వారిద్దరికీ గాయాలయ్యాయి.

ఇది జరిగిన కొన్ని గంటలకే ఉధంపూర్‌లో మరో బస్సులో పేలుడు సంభవించింది. గంటల వ్యవధిలోనే రెండు ఘటనలు జరగడం కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఉధంపూర్‌ బస్టాండ్‌లో నిలిపిన ఓ బస్సు పేలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. బ్లాస్టింగ్ జరిగిన పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. పేలుళ్ల ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. స్పాట్ లో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. 

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన