దండం పెడతా.. మీ డబ్బులు తీసుకోండి.. బ్యాంకులతో మాల్యా.. అసలు రీజన్ ఇదే..?

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా గురువారం రోజు మరోసారి ఇండియన్ బ్యాంకులను వేడుకున్నారు. తనకు ఇచ్చిన అసలు డబ్బులో వందశాతాన్ని వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను కోరారు. “మీకు రెండు చేతులు జోడించి దండం పెడతా.. దయచేసి మీరు ఇచ్చిన వంద శాతం డబ్బును వెంటనే వెనక్కి తీసుకోండి” అంటూ యూకేలోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ వెలుపలో మాల్యా అన్నారు. తాను తీసుకున్న లోన్ డబ్బులను తిరిగి చెల్లించలేదని బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో.. ఈడీ తన ఆస్తులన్నీంటిని […]

దండం పెడతా.. మీ డబ్బులు తీసుకోండి.. బ్యాంకులతో మాల్యా.. అసలు రీజన్ ఇదే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 14, 2020 | 4:45 AM

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా గురువారం రోజు మరోసారి ఇండియన్ బ్యాంకులను వేడుకున్నారు. తనకు ఇచ్చిన అసలు డబ్బులో వందశాతాన్ని వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను కోరారు. “మీకు రెండు చేతులు జోడించి దండం పెడతా.. దయచేసి మీరు ఇచ్చిన వంద శాతం డబ్బును వెంటనే వెనక్కి తీసుకోండి” అంటూ యూకేలోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ వెలుపలో మాల్యా అన్నారు.

తాను తీసుకున్న లోన్ డబ్బులను తిరిగి చెల్లించలేదని బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో.. ఈడీ తన ఆస్తులన్నీంటిని జప్తు చేసిందన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నేను ఎలాంటి నేరాలు చేయలేదని .. అయినా కూడా తన ఆస్తులను ఈడీ సుమోటోగా కేసు నమోదు చేసి.. జప్తు చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకులకు విజయ్ మాల్యా రిక్వెస్ట్ చేసుకున్నారు. దయచేసి మీరు ఇచ్చిన సొమ్మును వెనక్కి తీసుకోండని వేడుకుంటున్నారు. ఒకే రకమైన ఆస్తుల కోసం అటు ఈడీ, ఇటు బ్యాంకులు పోరాడుతున్నాయని మాల్యా ఆరోపించారు.

కాగా, బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా.. 2016లో లండన్‌కు పరారైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత ప్రభుత్వం ఆయనను తమకు అప్పగించాలని యూకేను కోరుతూనే ఉంది.