గ్యాస్ ధర పెంపు.. బీజేపీకి అదిరిపోయే పంచ్ ఇచ్చిన రాహుల్.. ఫోటో పెట్టి మరీ..!

ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్ అనంతరం.. ఒక్కసారిగా వంట గ్యాస్‌ ధర అమాంతం పెరగిపోవడంతో.. దేశ వ్యాప్తంగా నిరసనలకు రెడీ అవుతున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలో పెరిగిన వంట గ్యాస్‌ ధరపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా.. తనదైన శైలిలో బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. అప్పట్లో గ్యాస్ ధర పెరిగిందని.. బీజేపీ నేతలు చేసిన ధర్నాకు సంబంధించిన ఫోటోలను తన పోస్ట్‌లో పొందుపర్చారు. పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలంటూ […]

గ్యాస్ ధర పెంపు.. బీజేపీకి అదిరిపోయే పంచ్ ఇచ్చిన రాహుల్.. ఫోటో పెట్టి మరీ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 14, 2020 | 6:15 AM

ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్ అనంతరం.. ఒక్కసారిగా వంట గ్యాస్‌ ధర అమాంతం పెరగిపోవడంతో.. దేశ వ్యాప్తంగా నిరసనలకు రెడీ అవుతున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలో పెరిగిన వంట గ్యాస్‌ ధరపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా.. తనదైన శైలిలో బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. అప్పట్లో గ్యాస్ ధర పెరిగిందని.. బీజేపీ నేతలు చేసిన ధర్నాకు సంబంధించిన ఫోటోలను తన పోస్ట్‌లో పొందుపర్చారు.

పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన అప్పటి బీజేపీ నేతలు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలో స్మృతి ఇరానీ తదితర నేతలు అందులో ఉన్నారు. అప్పట్లో రోడ్లపైకి చేరి గ్యాస్‌ సిలిండర్లతో ఆందోళన చేపట్టారు. అయితే కేంద్రం పెంచిన ధరలను తాను ఏకీభవిస్తున్నానంటూ.. బీజేపీ చేపట్టిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌కు #RollBackHike అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసి.. పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా.. దేశీయంగా వంటగ్యాస్‌ సిలిండర్‌లపై ప్రభావం పడింది. దీంతో సిలిండర్ ధరను కేంద్రం ఒక్కసారిగా పెంచింది. సబ్సీడీయేతర సిలిండర్‌పై రూ. 144.5 పెంచింది.