త్వరలో “బిగ్ అనౌన్స్‌మెంట్”.. హాట్ టాపిక్‌గా “పీకే” కామెంట్స్.. ఇక బీజేపీకి తిప్పలేనా..?

రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్తగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ హిస్టారికల్ విన్‌లో పీకే పాత్రకూడా ఉంది. బీజేపీ ప్రచారాన్ని తట్టుకుని మరీ.. ఢిల్లీలో ఆప్ మరోసారి విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనుక పీకే ఫార్ములా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు.. సూచనల వల్లే.. అరవింద్ కేజ్రీవాల్ తన ఎలక్షన్ ప్రచారంలో మార్పులు […]

త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్.. హాట్ టాపిక్‌గా పీకే కామెంట్స్.. ఇక బీజేపీకి తిప్పలేనా..?
TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 14, 2020 | 1:43 AM

రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్తగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ హిస్టారికల్ విన్‌లో పీకే పాత్రకూడా ఉంది. బీజేపీ ప్రచారాన్ని తట్టుకుని మరీ.. ఢిల్లీలో ఆప్ మరోసారి విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనుక పీకే ఫార్ములా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు.. సూచనల వల్లే.. అరవింద్ కేజ్రీవాల్ తన ఎలక్షన్ ప్రచారంలో మార్పులు చేశారని తెలుస్తోంది. బీజేపీ నేతలంతా.. జాతీయాంశాలపై ప్రచారం చేపడితే.. అదే సమయంలో ఆప్ మాత్రం స్థానిక సమస్యలపైనే చర్చించింది. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను.. నెక్స్ట్ ఏం చేయబోతున్నానన్న అంశాలను ప్రజల్లోకి తీసుకేళ్లడంలో సక్సెస్ అయ్యారు కేజ్రీవాల్. ఈ అంశాలే కేజ్రీని విజయతీరాలకు చేర్చాయి.

కాగా ఢిల్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే.. ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ లైఫ్‌‌లో పలు కీలకమార్పులు వచ్చాయి. జేడీయూలో ఉన్న ఆయన్ను.. పార్టీ నుంచి బహిష్కరించింది అధిష్టానం. అయితే అనంతరం ఆయన ఎక్కడా కూడా ఎక్కువగా ఈ విషయంపై స్పందించలేదు. తన తదుపరి రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. తాజాగా ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఏమైనా ప్రకటిస్తారేమో అని అంతా ఎదురుచూసినా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది.

దీంతో ఓ నేషనల్ మీడియా.. ప్రశాంత్ కిషోర్‌ను ప్రశ్నించగా.. ఆయన ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 11 తర్వాత తానేదో కీలక ప్రకటన చేస్తానని అంతా అనుకున్నారనుకుంటా.. కానీ అందరికీ నిరాశ ఎదురైందేమో.. కానీ.. ఫిబ్రవరి 18న మాత్రం నేను ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నా.. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా పీకే కామెంట్స్ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. పీకే చేయబోయే ప్రకటన ఏంటీ..? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా ప్రశాంత్ కిషోర్.. ఏపీలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేకు, వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీకి ఆయన వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ.. బీజేపీకి ప్రత్యామ్నాయ వేదికను రూపొందించే పనిలో పీకే ఉన్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 18న చేయబోయే ప్రకటన అదేనా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu