బుడ్డోడు భలే లక్కీ.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు..!
కొందరికి అప్పుడప్పుడు లక్కీ ఛాన్స్‌లు అలా వచ్చేస్తుంటాయి. లక్కుంటే చాలు.. అవే వారి దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తాయి. కొంచెం లక్కుంటే చాలు.. అన్నీ ఆఫర్లు అవే వస్తాయని.. ఈ బుడ్డోడు రుజువు చేశాడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందర్నీ ఆకట్టుకున్న “బేబీ మఫ్లర్ మ్యాన్” అవ్యాన్ తోమర్ గురించి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త తన కుమారుడిని కేజ్రీవాల్ వేశధారణలో.. మఫ్లర్, టోపీ పెట్టి ఫోటోస్ షేర్ చేశాడు. దీంతో సేమ్ […]
కొందరికి అప్పుడప్పుడు లక్కీ ఛాన్స్‌లు అలా వచ్చేస్తుంటాయి. లక్కుంటే చాలు.. అవే వారి దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తాయి. కొంచెం లక్కుంటే చాలు.. అన్నీ ఆఫర్లు అవే వస్తాయని.. ఈ బుడ్డోడు రుజువు చేశాడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందర్నీ ఆకట్టుకున్న “బేబీ మఫ్లర్ మ్యాన్” అవ్యాన్ తోమర్ గురించి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త తన కుమారుడిని కేజ్రీవాల్ వేశధారణలో.. మఫ్లర్, టోపీ పెట్టి ఫోటోస్ షేర్ చేశాడు. దీంతో సేమ్ జూనియర్ కేజ్రీ లా ఉండేసరికి.. అతడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. దీంతో ఆ విషయం ఆప్ అధినేత వరకు చేరింది.
తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కూడా.. మళ్లీ ఈ బేబీ మఫ్లర్ మ్యాన్ పోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. దీంతో అతడికి ఆప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 16వ తేదీన జరగనున్న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవానికి ఈ బుడ్డోడికి ఆహ్వానం పలికింది. ఈ విషయాన్ని ఆప్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అది కూడా ఆ “బేబీ మఫ్లర్ మ్యాన్” ఫోటో పెట్టి మరీ. “బిగ్ అనౌన్స్‌మెంట్” అని చెప్తూ.. ఫిబ్రవరి 16న జరుగనున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి బేబీ మఫ్లర్‌మ్యాన్‌ను ఆహ్వానించామని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కింద “సూట్ అప్ జూనియర్” అని ఆ బుడ్డోడి ఫొటోను కూడా షేర్ చేశారు.
Big Announcement:
Baby Mufflerman is invited to the swearing in ceremony of @ArvindKejriwal on 16th Feb.
Suit up Junior! pic.twitter.com/GRtbQiz0Is
— AAP (@AamAadmiParty) February 13, 2020