BJP Double Game: వైసీపీ, జనసేనలతో బీజేపీ డబుల్ గేమ్

BJP playing double game in Andhra Pradesh: కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ఏపీలో డబుల్ గేమ్ అడుతోందా? పరిణామాలు, ఊహాగానాలు నిజమే అయితే ఏపీలో బీజేపీ ఆడేది ఖచ్చితంగా డబుల్ గేమ్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వచ్చే అయిదేళ్ళలో ఏపీలో అధికారంలో భాగస్వాములయ్యేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుల్లో ఓ పక్క వైసీపీతోను, ఇంకోపక్క జనసేనతోను పక్కా వ్యూహంలో బీజేపీ ముందుకు వెళుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2019 ఎన్నికల్లో ఏపీలో కనీసం బోణీ […]

BJP Double Game: వైసీపీ, జనసేనలతో బీజేపీ డబుల్ గేమ్
Follow us

|

Updated on: Feb 13, 2020 | 7:02 PM

BJP playing double game in Andhra Pradesh: కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ఏపీలో డబుల్ గేమ్ అడుతోందా? పరిణామాలు, ఊహాగానాలు నిజమే అయితే ఏపీలో బీజేపీ ఆడేది ఖచ్చితంగా డబుల్ గేమ్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వచ్చే అయిదేళ్ళలో ఏపీలో అధికారంలో భాగస్వాములయ్యేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుల్లో ఓ పక్క వైసీపీతోను, ఇంకోపక్క జనసేనతోను పక్కా వ్యూహంలో బీజేపీ ముందుకు వెళుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

2019 ఎన్నికల్లో ఏపీలో కనీసం బోణీ కొట్టలేకపోయిన బీజేపీ.. ఆ తర్వాత అటు వైసీపీతోను, ఇటు జనసేనతోను సమాన దూరం పాటిస్తూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో బీజేపీ, జనసేన దోస్తీ కుదిరింది. జనవరి మూడో వారంలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలయ్యాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా రెండు పార్టీలు పని చేస్తాయని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. ఇది జరిగి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు.

అంతలోనే బీజేపీ మరో వ్యూహానికి తెరలేపింది. వైసీపీని దగ్గర చేసుకునేందుకు కొన్నాళ్ళ నుంచి విఫలయత్నం చేస్తూ వస్తున్న కమలనాథులు.. తాజాగా ఏపీలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో చక్రం తిప్పుతున్నారు. ఏపీలో ఇపుడు అత్యంత అవసరంగా మండలి రద్దు జరగాల్సిన అవసరం వుంది. మండలి రద్దైతే గానీ మూడు రాజధానుల ప్రతిపాదనలో అడుగు ముందుకు పడే పరిస్థితి లేదు. దాంతో మంతనాలకొచ్చిన వైసీపీ అధినేత జగన్ ముంగిట ఎన్డీయేలో చేరాలన్న ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్డీయేలో చేరితే కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడమే కాకుండా.. భవిష్యత్తులో జగన్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నది బీజేపీ ప్రతిపాదన. స్వయంగా నరేంద్ర మోదీ ఈ ప్రతిపాదన చేయడంతో కాదన లేని పరిస్థితి జగన్‌కు ఉత్పన్నమైందని అంటున్నారు. ఈ భేటీ జరిగిన రెండో రోజే మరోసారి జగన్‌ను ఢిల్లీ వచ్చి, అమిత్ షాను కల్వాల్సిందిగా బీజేపీ నేతలు కోరడంతో వైసీపీని చేర్చుకోవడంలో కమలనాథులు దూకుడు ప్రదర్శిస్తున్నట్లుగా స్పష్టమయింది.

ప్రస్తుత రాజకీయ అవసరాల కోసం జగన్ కేంద్ర కేబినెట్‌లో చేరితే.. మరి ఇదివరకే జత కట్టిన జనసేన పరిస్థితి ఏంటి ? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి ప్రత్యామ్నాయ కూటమిగా 2024 నాటికి ఎదుగుతామని ప్రకటించిన జనసేనాని.. రేపు బీజేపీ, వైసీపీతో జత కడితే ఏం చేస్తారన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. ఓ వైపు జనసేనను ఆల్‌రెడీ ఎన్డీయేలో కలుపుకున్న బీజేపీ.. వైసీపీని లాగేస్తే.. అది ఏపీలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు కలిసి వచ్చే అంశంగా మారుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంఛనా. బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.