Koratala Siva: కొరటాల సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్..!

Koratala Siva: టాలీవుడ్‌లోని టాప్ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కొరటాల.. ఆ తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాల ద్వారా వరుసగా నాలుగు హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక స్టైల్ ఉంటుంది. తన ప్రతి సినిమాలో ఏదొక సామాజిక అంశాన్ని ప్రధానాంశంగా చూపించే ఆయన.. ప్రేక్షకుల్లో అవేర్‌నెస్ తీసుకొస్తుంటారు. ఇక ప్రస్తుతం కొరటాల, మెగాస్టార్ చిరంజీవితో […]

Koratala Siva: కొరటాల సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 13, 2020 | 7:00 PM

Koratala Siva: టాలీవుడ్‌లోని టాప్ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కొరటాల.. ఆ తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాల ద్వారా వరుసగా నాలుగు హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక స్టైల్ ఉంటుంది. తన ప్రతి సినిమాలో ఏదొక సామాజిక అంశాన్ని ప్రధానాంశంగా చూపించే ఆయన.. ప్రేక్షకుల్లో అవేర్‌నెస్ తీసుకొస్తుంటారు. ఇక ప్రస్తుతం కొరటాల, మెగాస్టార్ చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆచార్య అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే త్వరలో కొరటాల రిటైర్మెంట్ తీసుకోనున్నారట. దర్శకుడిగా పది సినిమాలు మాత్రమే చేస్తానని.. ఆ తరువాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటానని కొరటాల తన సన్నిహితుల వద్ద చెప్పారట. దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇక ఇదే విషయాన్ని పలువురు నిర్మాతలకు సైతం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఇప్పుడు షాక్‌కు గురౌతున్నారు. అంత మంచిగా సినిమాలు తీసే దర్శకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా మరో టాప్ దర్శకుడు సుకుమార్ సైతం.. తాను ఇంకో రెండు, మూడు సినిమాలు తీసి రిటైర్మెంట్ తీసుకుంటానని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత సుకుమార్ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు సైతం సుకుమార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అప్పట్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.