Sharwanand: శర్వాకు ఆ హీరోయిన్లు కలిసి రావడం లేదా..!

Sharwanand: టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యంగ్ హీరోలలో శర్వానంద్ ఒకరు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరోకు మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఈ మధ్య శర్వా కాస్త ఢీలా పడ్డారు. శర్వా ఖాతాలో వరసగా హ్యాట్రిక్ ఫ్లాప్ పడింది. దీంతో తాను నటించే తదుపరి సినిమాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఈ హీరోకు స్టార్ హీరోయిన్లు కలిసి రావడం లేదన్న టాక్ […]

Sharwanand: శర్వాకు ఆ హీరోయిన్లు కలిసి రావడం లేదా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 13, 2020 | 7:34 PM

Sharwanand: టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యంగ్ హీరోలలో శర్వానంద్ ఒకరు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరోకు మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఈ మధ్య శర్వా కాస్త ఢీలా పడ్డారు. శర్వా ఖాతాలో వరసగా హ్యాట్రిక్ ఫ్లాప్ పడింది. దీంతో తాను నటించే తదుపరి సినిమాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఈ హీరోకు స్టార్ హీరోయిన్లు కలిసి రావడం లేదన్న టాక్ ఇప్పుడు టాలీవుడ్‌లో నడుస్తోంది.

హీరోగా ఇప్పటివరకు 20 చిత్రాల్లో నటించారు శర్వానంద్. ఇందులో చాలా వరకు సినిమాల్లో యంగ్ హీరోయిన్లతో జోడీ కట్టిన శర్వా.. కొన్ని మూవీల్లో స్టార్ హీరోయిన్లతోనూ నటించారు. నువ్వా నేనాలో శ్రియ, రణ రంగంలో కాజల్, జాను చిత్రంలో సమంతతో కలిసి రొమాన్స్ చేశారు శర్వా. అయితే ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. దీంతో శర్వాకు స్టార్ హీరోయిన్లు కలిసిరాలేదని కొందరు అంటున్నారు. అలాగని యంగ్ హీరోయిన్లతో శర్వా నటించిన అన్ని సినిమాలు కూడా సక్సెస్ అవ్వకపోగా.. సినిమా సక్సెస్ అన్నది దర్శకుడి ప్రతిభపై ఆధారపడి ఉంటుందని మరికొందరు అంటున్నారు. కాగా ప్రస్తుతం శ్రీకారం అనే చిత్రంతో పాటు కీరవాణి అనే మరో చిత్రంలో శర్వా నటించబోతున్నారు. వీటితో పాటు ఆర్ఎక్స్ 100 ఫేమ్ తెరకెక్కించబోతున్న మహా సముద్రంలోనూ నటించేందుకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.