కోట్లు కొల్లగొట్టిన స్విమ్మింగ్‌పూల్ పెయింటింగ్
రెండు వందల కోట్లకు పైగా సొమ్ము పెట్టి కొనుక్కునేంతగా ఏముందని ఈ పెయింటింగ్‌లో… ఇలాగని మనమనుకుంటాం కానీ.. కళాప్రియుల దృష్టితో చూస్తే ఆ పెయింటింగ్ విలువేమిటో అర్థమవుతుంది… బ్రిటన్‌కు చెందిన డేవిడ్ హాక్నీ అనే ఆర్టిస్ట్ వేశాడీ పెయింటింగ్‌ను.. ద స్ల్పాష్ పేరుతో మూడు పెయింటింగ్‌లను ఆ ఆర్టిస్టు వేశాడు.. 1966, 1967 కాలం నాటి ఆ పెయింటింగ్‌లను లండన్‌లోని సొథెబీ అనే వేలం సంస్థ వేలం వేసింది… కొనుక్కున్న వారి పేరు తెలియదు కానీ 2.98 […]
రెండు వందల కోట్లకు పైగా సొమ్ము పెట్టి కొనుక్కునేంతగా ఏముందని ఈ పెయింటింగ్‌లో… ఇలాగని మనమనుకుంటాం కానీ.. కళాప్రియుల దృష్టితో చూస్తే ఆ పెయింటింగ్ విలువేమిటో అర్థమవుతుంది… బ్రిటన్‌కు చెందిన డేవిడ్ హాక్నీ అనే ఆర్టిస్ట్ వేశాడీ పెయింటింగ్‌ను.. ద స్ల్పాష్ పేరుతో మూడు పెయింటింగ్‌లను ఆ ఆర్టిస్టు వేశాడు.. 1966, 1967 కాలం నాటి ఆ పెయింటింగ్‌లను లండన్‌లోని సొథెబీ అనే వేలం సంస్థ వేలం వేసింది… కొనుక్కున్న వారి పేరు తెలియదు కానీ 2.98 కోట్ల డాలర్లు పెట్టి కొన్నాడు.. మన కరెన్సీలో చెప్పాలంటే 212 కోట్ల రూపాయలు.. మూడు పెయింటింగ్‌లు ఒకే రకంగా ఉన్నా.. సైజుల్లో మాత్రం చిన్నపాటి తేడాలున్నాయి.. ద స్ల్పాష్‌ను వేలం వేయడం ఇది మొదటిసారేం కాదు.. ఇంతకు ముందు 2006లో వేలం వేస్తే దాదాపు 39 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యింది.. ఇదంతా చదివాక ఊపిరి సినిమాలో కార్తీలా మీక్కూడా అర్జెంటుగా బ్రష్షు పట్టుకోవాలనిపిస్తుంది కదూ! ఆలస్యం ఎందుకు ..? ప్రోసీడ్…