AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Election Results: ఆ వ్యాఖ్యలతోనే ఎన్నికల్లో ఓడిపోయాంః అమిత్ షా

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సీఏఏ, ఎన్ఆర్సీల ఎఫెక్ట్ పడలేదన్న ఆయన.. తమ అంచనా పూర్తిగా తలక్రిందులైందని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచార వేళ తమ పార్టీ నేతలు కొంతమంది 'గోలీమారో', 'ఇండో-పాక్ మ్యాచ్'  వంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని అభిప్రాయపడ్డారు...

Delhi Election Results: ఆ వ్యాఖ్యలతోనే ఎన్నికల్లో ఓడిపోయాంః అమిత్ షా
Ravi Kiran
|

Updated on: Feb 14, 2020 | 3:21 PM

Share

Delhi Assembly Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆ ఎన్నికల ఓటమితో బీజేపీకి మరో భంగపాటు తప్పలేదు. హస్తినలో అధికారం తమదేనంటూ ప్రచారంలో హోరెత్తించిన కాషాయ పార్టీ కేవలం 8 సీట్లకు మాత్రం పరిమితమైంది. తాజాగా ఈ పరాభవంపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఎన్నికల్లో గెలుపోటముల కోసం తలబడలేదని.. కేవలం తమ భావజాలాన్ని విస్తరించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు.

Also Read: PM Modi Security Cover Shock You

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సీఏఏ, ఎన్ఆర్సీల ఎఫెక్ట్ పడలేదన్న ఆయన.. తమ అంచనా పూర్తిగా తలక్రిందులైందని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచార వేళ తమ పార్టీ నేతలు కొంతమంది ‘గోలీమారో’, ‘ఇండో-పాక్ మ్యాచ్’  వంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యాఖ్యల వల్లే బీజేపీకి నష్టం వాటిల్లిందన్నారు.

Read More: Oscar Awards In Politics, Amit Shah Bags Prestigious…

ఈ దేశాన్ని మత ప్రాతిపదికతో కాంగ్రెస్ పార్టీనే విభజించిందని అమిత్ షా తెలిపారు. సీఏఏ సంబంధిత అంశాలపై ఎవరైనా వచ్చి తనతో మాట్లాడాలని అనుకుంటే.. వారికి మూడు రోజుల్లో సమయాన్ని కేటాయిస్తానన్నారు. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌లో నేతల హౌస్ అరెస్ట్ నిర్ణయం అంతా స్థానిక అధికారులేదని.. అందులో కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎన్ఆర్పీ ప్రక్రియకు ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని అమిత్ షా మరోసారి వెల్లడించారు.