Bottled Drinking Water: ఇకపై లీటర్ వాటర్ బాటిల్ కేవలం రూ.13 మాత్రమే…

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ రేట్లను పెంచుతూ వస్తున్న తయారీ కంపెనీలకు కేరళ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇకపై లీటర్ వాటర్ ఖచ్చితంగా రూ.13కే అమ్మాలని.. అంతేకాక బ్రాండెడ్ మినరల్ వాటర్ అయినా కూడా అదే స్థాయిలో ఉండాలని ఆదేశించారు...

Bottled Drinking Water: ఇకపై లీటర్ వాటర్ బాటిల్ కేవలం రూ.13 మాత్రమే...
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 14, 2020 | 3:24 PM

Bottled Drinking Water New Rate: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ రేట్లను అమాంతం పెంచేసిన తయారీ కంపెనీలకు కేరళ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. నిత్యావసర వస్తువుల చట్టం కిందకు వాటర్ బాటిళ్ల రేట్లను కూడా తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే లీటర్ వాటర్ బాటిల్ రేట్‌ను ఫిక్స్ చేసింది. ఇకపై లీటర్ వాటర్ ఖచ్చితంగా రూ.13కే అమ్మాలని.. అంతేకాక బ్రాండెడ్ మినరల్ వాటర్ అయినా కూడా అదే స్థాయిలో ఉండాలని ఆదేశించింది.

Also Read: Chennai AC Hotel Serves Full Meals For Rs 30

ఆ రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాల మంత్రి పి.థిలోత్తమన్ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం కేరళలో లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు రూ.20 ఉంది. అయితే రెండేళ్ల క్రిందట ఈ ధరనే రూ.11 లేదా రూ.12కు తగ్గించాలని అనుకున్నాం. కానీ అప్పుడు వాటర్ బాటిల్ తయారీదారులు, ట్రేడర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో అమలు చేయడం సాధ్యం కాలేదన్నారు.

Also Read: Fastag Free For 15 Days

ఇటీవల అధిక రేట్లలో బాటిల్ విక్రయాల జరుగుతుండటంపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఇకపై రాష్ట్రంలో లీటర్ వాటర్ బాటిల్ 13 రూపాయలుగా విక్రయించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేస్తాం అని’ పి. థిలోత్తమన్ తెలిపారు. ఒకవేళ తాము నిర్దేశించిన రేట్ల కంటే అధిక మొత్తంలో వాటర్ బాటిల్స్ అమ్మితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.