Breaking News
  • తూ.గో: కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి 200 పడకలు, ల్యాబ్‌ సిద్ధం చేసిన అధికారులు కరోనా అనుమానితులకు పరీక్షల నిర్వహణ
  • ఏప్రిల్‌ 14 వరకు తెలంగాణ న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ లాక్‌డౌన్‌ పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు లాక్‌డౌన్‌ ఉంటుందన్న హైకోర్టు న్యాయశాఖ ఉద్యోగులు ఇళ్లలోనే అందుబాటులో ఉండాలన్న హైకోర్టు అత్యవసర విచారణల కోసం న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్‌లు.. రొటేషన్‌ పద్ధతిలో విధుల్లో ఉండాలన్న హైకోర్టు రిమాండ్‌, బెయిల్‌ పిటిషన్ల విచారణలు.. వీడియో కాన్ఫరెన్స్‌ లేదా స్కైప్‌ ద్వారా చేపట్టాలన్న హైకోర్టు అత్యవసర పిటిషన్లు ఈమెయిల్ ద్వారా దాఖలు చేయాలన్న హైకోర్టు
  • అమరావతి: కరోనాపై సెక్రటరీస్‌ లెవెల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు మొత్తం 13 సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు టాస్క్‌ఫోర్స్‌ చైర్‌పర్సన్‌గా చీఫ్‌ సెక్రటరీ కో-చైర్మన్‌గా హెల్త్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నియామకం కరోనాపై సమీక్ష, లాక్‌డౌన్ అమలుపై చర్యలు తీసుకోనున్న టాస్క్‌ఫోర్స్
  • రంగారెడ్డి: ఓఆర్‌ఆర్‌పై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం బొలెరో వాహనంను ఢీకొట్టిన లారీ, ఐదుగురు మృతి మరో ఆరుగురి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు శంషాబాద్‌, పెద్దగోల్కొండ దగ్గర ఓఆర్‌ఆర్‌పై ఘటన మృతులు సొంతూళ్లకు వెళ్తున్న కర్నాటక కూలీలుగా గుర్తింపు ప్రమాద సమయంలో వాహనంలో 30 మంది వలస కూలీలు
  • కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా గుర్తింపు రెడ్‌జోన్‌గా చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజల్‌, కొత్తపేట 14 రోజుల పాటు ఇళ్లలోనే రెడ్‌జోన్‌ ప్రాంతం ఇంటికే రేషన్‌, నిత్యావసర వస్తువుల సరఫరా
  • విశ్వరూపం దాల్చిన కరోనా మహమ్మారి. 198 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా 5,74,834కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు. 26,368కి చేరుకున్న కరోనా మరణాల సంఖ్య. 3.83 లక్షల యాక్టివ్‌ కేసులు, 1,24,326 మంది రికవరీ. కరోనా కేసుల్లో అగ్రస్థానంలో అమెరికా. అమెరికాలో లక్ష దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు. 86,498 కేసులతో రెండో స్థానంలో ఇటలీ. 81,340 కేసులతో మూడో స్థానంలో చైనా. స్పెయిన్‌-64,059, జర్మనీ-49,344 పాజిటివ్‌ కేసులు. ఇరాన్‌-32,332, బ్రిటన్‌-14,543 పాజిటివ్‌ కేసులు. స్విట్జర్లాండ్‌-12,311, ద.కొరియా-9,332 పాజిటివ్‌ కేసులు. నెదర్లాండ్స్‌-8,603, భారత్‌-810 పాజిటివ్‌ కేసులు.
  • భారత్‌లో 834కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు. శుక్రవారం ఒక్కరోజే 116 కేసులు నమోదు. దేశంలో 17కు చేరిన కరోనా మరణాల సంఖ్య. దక్షిణ కర్ణాటకలో 10 నెలల చిన్నారికి సోకిన వైరస్‌.

Chennai Hotel Goes Viral: అక్కడ 10 రూపాయలకే ప్లేట్ భోజనం.. రూ.30కి ఫుల్ మీల్స్..

Chennai Hotel Goes Viral, Chennai Hotel Goes Viral: అక్కడ 10 రూపాయలకే ప్లేట్ భోజనం.. రూ.30కి ఫుల్ మీల్స్..

Chennai Hotel Goes Viral: సాధారణంగా ఏసీ రెస్టారెంట్లలో భోజనం చేయాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చవుతుంది. అలాగే చిన్న హోటళ్లలో అయితే ఫుల్ మీల్స్ రూ.70 నుంచి రూ.100 ఉంటుంది. కానీ చెన్నైలోని ఓ హోటల్‌లో కేవలం రూ.10కే ప్లేట్ భోజనం.. అలాగే రూ.30కే ఫుల్ మీల్స్ లాగించేయవచ్చు. అదీ కూడా అక్కడ సిబ్బంది ఏసీ గదిలో వడ్డిస్తారు. రజనీకాంత్ అభిమాని ఒకరు చెన్నైలోని సాలి గ్రామంలో ఈ హోటల్‌ను నిర్వహిస్తున్నారు.

స్థానిక కార్మికులకు, రోజువారీ కూలీలకు అందుబాటులో ఉండే రేట్లతో స్టార్ హోటళ్లకు ధీటుగా యాజమాన్యం ఈ హోటల్‌ను నడుపుతోంది. అన్నంతో పాటు సాంబార్, రెండు రకాల కర్రీస్, రసం, మజ్జిగను వడ్డిస్తూ పేదవారి ఆకలి తీరుస్తోంది. మధ్యాహ్నం వేళల్లో ఈ హోటల్ కిటకిటలాడుతుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండటంతో పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు అక్కడికి భోజనానికి వెళ్తున్నారు. ఇక ఆ హోటల్ యజమాని వీరబాబు మాట్లాడుతూ కేవలం సేవా దృక్పధంతోనే ఈ హోటల్‌ను పెట్టామని స్పష్టం చేశాడు. కాగా, రజనీకాంత్ వీరాభిమానులు మరికొందరు ఇలాంటి హోటల్స్‌ను తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నడుపుతున్నట్లు తెలుస్తోంది.

Chennai Hotel Goes Viral, Chennai Hotel Goes Viral: అక్కడ 10 రూపాయలకే ప్లేట్ భోజనం.. రూ.30కి ఫుల్ మీల్స్..

Related Tags