ICICI Bank: కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ బ్యాంకు .. మే 1 నుంచి 10 రకాల ఛార్జీల వడ్డన

మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం భారతదేశపు రెండవ అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవల తన వినియోగదారులకు షాకివ్వనుంది. అనేక సేవల రుసుములలో మార్పులను ప్రకటించింది. ఈ మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వీటిలో ఏటీఎం వినియోగం, డెబిట్ కార్డ్, చెక్ బుక్, ఐఎంపీఎస్, స్టాప్ పేమెంట్, సంతకానికి సంబంధించిన ఫీజులు ఉన్నాయి. మరి వినియోగదారులకు..

ICICI Bank: కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ బ్యాంకు .. మే 1 నుంచి 10 రకాల ఛార్జీల వడ్డన
Bank Charges
Follow us

|

Updated on: Apr 27, 2024 | 9:38 AM

మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం భారతదేశపు రెండవ అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవల తన వినియోగదారులకు షాకివ్వనుంది. అనేక సేవల రుసుములలో మార్పులను ప్రకటించింది. ఈ మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వీటిలో ఏటీఎం వినియోగం, డెబిట్ కార్డ్, చెక్ బుక్, ఐఎంపీఎస్, స్టాప్ పేమెంట్, సంతకానికి సంబంధించిన ఫీజులు ఉన్నాయి. మరి వినియోగదారులకు ఏయే ఛార్జీలను మోపనుందో తెలుసుకుందాం.

  1. ఐసిఐసిఐ బ్యాంక్ సాధారణ లొకేషన్లలో నివసించే కస్టమర్ల నుండి సంవత్సరానికి రూ. 200, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కస్టమర్ల నుండి రూ. 99 వసూలు చేస్తుంది.
  2. ఒక సంవత్సరంలో మొదటి 25 చెక్ పేజీలకు బ్యాంక్ ఎటువంటి రుసుమును వసూలు చేయదు. కానీ ఆ తర్వాత కస్టమర్లు ఒక్కో చెక్‌బుక్‌కు రూ.4 చెల్లించాలి.
  3. ఏదైనా ప్రత్యేక చెక్కు కోసం రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే కస్టమర్ సేవ IVR, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉచితం.
  4. డూప్లికేట్ పాస్‌బుక్‌ను జారీ చేయడానికి బ్యాంక్ రూ. 100, అప్‌డేట్ కోసం పేజీకి రూ. 25 వసూలు చేస్తుంది.
  5. హోమ్ బ్రాంచ్ లో నెలకు మొదటి 3 నగదు లావాదేవీలు ఉచితం. ఆ తరువాత ప్రతి లావాదేవీకి రూ.150.
  6. కార్డు పోయినా లేదా పాడైపోయినా, కార్డును రీప్లేస్ చేయడానికి కస్టమర్ రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
  7. వీసా నిబంధనల ప్రకారం, బుకింగ్‌పై వినియోగదారుల నుండి 1.8% రుసుము వసూలు చేయనుంది.
  8. సేవింగ్స్ ఖాతాల కోసం ఫోటో, సంతకం వెరిఫికేషన్ కోసం ICICI బ్యాంక్ కస్టమర్ల నుండి ఒక్కో దరఖాస్తుకు రూ.100 వసూలు చేస్తుంది.
  9. సెలవులు, సాయంత్రం 06:00 గంటల మధ్య క్యాష్ యాక్సెప్టర్/రీసైక్లర్ మెషీన్‌లలో డిపాజిట్ చేసిన నగదుపై ప్రతి లావాదేవీకి బ్యాంక్ రూ. 50 రుసుమును విధిస్తుంది.
  10. ఒక్కో లావాదేవీకి రూ.1,000 వరకు ఉన్న మొత్తాలకు రూ.2.50, రూ.1,000 కంటే ఎక్కువ మొత్తంలో ఒక్కో లావాదేవీకి రూ.5, రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు ఒక్కో లావాదేవీకి రూ.15 చొప్పున వసూలు చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి