Pet Dog Saves Family: పెద్ద ప్రమాదం నుంచి కుటుంబాన్ని పెంపుడు కుక్క.. అలర్ట్ కాకుంటే ప్రాణాలే పోయేవి..!
Pet Dog Saves Family: గ్రేటర్ నోయిడాలో ఓ పెంపుడు కుక్క ఒక కుటుంబాన్ని అగ్ని ప్రమాదం నుంచి రక్షించింది. ఈ ఘటన నోయిడాలోని ఒమేగా...
Pet Dog Saves Family: గ్రేటర్ నోయిడాలో ఓ పెంపుడు కుక్క ఒక కుటుంబాన్ని అగ్ని ప్రమాదం నుంచి రక్షించింది. ఈ ఘటన నోయిడాలోని ఒమేగా 1 లోని గ్రీన్ వుడ్స్ సొసైటీలో గల డ్యూప్లెక్స్ విల్లాల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని రన్ చేస్తున్న శేష్ సారంగధర్(38), తన భార్య(గర్భిణి)తో కలిసి గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటున్నాడు. అయితే, శేష్.. గత మార్చి నెలలో నాలుగు వీధి కుక్కలను దత్తత తీసుకుని సాకడం ప్రారంభించాడు. అందులో 3 ఏళ్ల కుక్కకు బ్రావో అని పేరుపెట్టారు. ఈ బ్రావోనే శేష్ కుటుంబాన్ని పెద్ద ప్రమాదం నుంచి తప్పించింది. బ్రావో గనుక అప్రమత్తంగా లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.
తాజాగా శేష్ దంపతులు బెడ్‌రూమ్‌లో నిద్రిస్తుండగా.. ఇళ్లంతా పొగతో నిండిపోయింది. వెంటనే అలర్ట్ అయిన బ్రావో.. బెడ్ రూమ్‌లో ఉన్న శేష్ దంపతులను హెచ్చరించింది. బెడ్ రూమ్ డోర్‌ను తట్టడం, అరవడం చేసింది. బ్రావో అరుపులకు చిరాకు పడ్డ శేష్ డోర్ తెరచి చూడగా.. ఇళ్లంతా పొగ చూరింది. దాంతో వారు షాక్ అయ్యారు. వంట గదికి వెళ్లి చూడగా.. మంటలు, పొగ దట్టంగా వ్యాపించాయి. శేష్ వెంటనే నీటితో ఆ మంటలను ఆర్పేశాడు. ఆ తరువాత తమ ప్రాణాలను కాపాడిన బ్రావోకో థ్యాంక్స్ చెప్పాడు.
శేష్ భార్య నిద్రపోయే ముందు వంట గదిలో స్టౌవ్‌పై నూనెతో కూడిన బౌల్‌ను పెట్టింది. అయితే, స్టౌవ్‌పై నూనె బౌల్ పెట్టిన విషయాన్ని ఆమె మర్చిపోయింది. అలా ఆమె బెడ్‌రూమ్‌లో నిద్రించింది. దీనిని శేష్ కూడా గమనించలేదు. దాంతో ఈ ప్రమాదం సంభవించింది. బ్రావో అప్రమత్తత వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని, బ్రావో తెలివి తేటలు అమోఘం అని శేష్ పేర్కొన్నాడు.
Also read: