ఆర్టికల్ 370రద్దు: చొక్కా చించుకున్న పీడీపీ ఎంపీ
జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం సాహోసేపత నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదన చేశారు. దీనికి విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ.. రాష్ట్రపతి భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కాగా రాజ్యసభలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టే సమయంలో పీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు నజిర్ అహ్మద్ లావే, ఎంఎం ఫయాజ్ రాజ్యాంగంలోని కొన్ని ప్రతులను చించేశారు. దీంతో వారిద్దరిని బయటకు వెళ్లాలని రాజ్యసభ […]
జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం సాహోసేపత నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదన చేశారు. దీనికి విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ.. రాష్ట్రపతి భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కాగా రాజ్యసభలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టే సమయంలో పీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు నజిర్ అహ్మద్ లావే, ఎంఎం ఫయాజ్ రాజ్యాంగంలోని కొన్ని ప్రతులను చించేశారు. దీంతో వారిద్దరిని బయటకు వెళ్లాలని రాజ్యసభ చైర్మన్ కోరారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఫయాజ్ తన చొక్కాను చించుకొని తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం బయటకు వెళ్లి.. వారిద్దరు తమ ఆందోళనను కొనసాగించారు.
PDP's RS MPs Nazir Ahmad Laway&MM Fayaz protest in Parliament premises after resolution revoking Article 370 from J&K moved by HM in Rajya Sabha; The 2 PDP MPs were asked to go out of the House after they attempted to tear the constitution. MM Fayaz also tore his kurta in protest pic.twitter.com/BtalUZMNCo
— ANI (@ANI) August 5, 2019