ముక్కలైన జమ్ముకశ్మీర్… ఆర్టికల్ 370 రద్దు

జమ్ముకశ్మీర్‌ ఉద్రిక్తతకు కేంద్రం తెరదించింది. జమ్మూ కశ్మీరుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఇక జమ్ముకశ్మీర్‌ను రెండు భాగాలుగా చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జమ్మూ మరియు కశ్మీర్‌, లడఖ్‌‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్ ఏర్పడనుంది. ఇక చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్‌‌ ఏర్పడనుంది. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370, 35ఏ కూడా కేంద్ర ప్రభుత్వం […]

ముక్కలైన జమ్ముకశ్మీర్... ఆర్టికల్ 370 రద్దు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 05, 2019 | 1:10 PM

జమ్ముకశ్మీర్‌ ఉద్రిక్తతకు కేంద్రం తెరదించింది. జమ్మూ కశ్మీరుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఇక జమ్ముకశ్మీర్‌ను రెండు భాగాలుగా చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జమ్మూ మరియు కశ్మీర్‌, లడఖ్‌‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్ ఏర్పడనుంది. ఇక చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్‌‌ ఏర్పడనుంది. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370, 35ఏ కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.