AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో బాంబు..! ప్రయాణికుడు కేకలు వేయటంతో హై అలర్ట్‌..

ఎయిర్‌వేస్ విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు కేకలు వేయడంతో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ల్యాండింగ్‌ చేశారు. వెంటనే సీఐఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించారు. స్నిఫర్ డాగ్ సహాయంతో విమానంలో క్షుణ్ణంగా పరిశీలించారు.

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో బాంబు..! ప్రయాణికుడు కేకలు వేయటంతో హై అలర్ట్‌..
Bomb In Plane
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2023 | 7:04 AM

Share

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కలకలం లేపింది. విమానంలో బాంబు ఉందని టేకాఫ్‌కు ముందు ఒక వ్యక్తి అరవడం ప్రారంభించడంతో ప్రయాణికులందరినీ విమానం నుంచి దించారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కోల్‌కతా నుంచి దోహా వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు కేకలు వేయడంతో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ల్యాండింగ్‌ చేశారు. వెంటనే సీఐఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దింపేశారు. స్నిఫర్ డాగ్ సహాయంతో విమానంలో క్షుణ్ణంగా పరిశీలించారు. విమానం మొత్తం పరిశీలించిన ఎలాంటి ప్రమాదకర అనవాళ్లు లేవని గుర్తించారు. దీంతో ప్రయాణీకులు, ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అందిన సమాచారం ప్రకారం.. మంగళవారం (జూన్ 6) తెల్లవారుజామున 3.29 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 541 మంది ప్రయాణికులతో దోహా మీదుగా లండన్‌కు వెళ్లే ఖతార్ ఎయిర్‌వేస్ విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ అరిచాడు. విమాన సిబ్బంది వెంటనే సీఐఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించారు. ప్రయాణికులను దించేశారు.దీని తర్వాత స్నిఫర్ డాగ్స్ సహాయంతో విమానం మొత్తం వెతికినా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. అనంతరం బాంబు ఉందంటూ కేకలు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఎయిర్ పోర్టు ఆధ్వర్యంలో కస్టోడియల్ ఇంటరాగేషన్ తర్వాత.. సదరు వ్యక్తి తండ్రిని విమానాశ్రయానికి పిలిపించి విచారించగా… తన కొడుకు మానసిక స్థితి సరిగా లేదనీ, మానసిక వ్యాధికి చికిత్స పొందుతున్నాడని తెలిపే కొన్ని పత్రాలను భద్రతా సిబ్బందికి సమర్పించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..