Dog Meat: డాగ్ మీట్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చన గౌహతి హైకోర్టు.. తరతరాలుగా కుక్క మాంసంతో చికిత్స
నాగాలాండ్‌లో మతం లేదా ఆహారపు అలవాట్లకు సంబంధించిన భారతీయ చట్టాలు విధించబడవు. ఆ రాష్ట్ర ప్రత్యేక హోదా సామాజిక ఆచారాల పరిరక్షణకు హామీ ఇస్తుంది. ఇక్కడి ప్రజలు తరతరాలుగా కుక్క మాంసాన్ని చికిత్సగా కూడా తీసుకుంటారు.
నాగాలాండ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కుక్కల మాంసం విషయంలో సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసిన హైకోర్టు.. డాగ్ మీట్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గౌహతి హైకోర్టు. కుక్క మాంసం ఎగుమతులు, విక్రయాలపై నాగాలాండ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు కోట్టేసింది. వాణిజ్య అవసరాల కోసం కుక్కల దిగుమతి, వాటితో వర్తకం, రెస్టారెంట్లలో వాణిజ్య ప్రాతిపదిక, వాటి మాంసం విక్రయాలను నిషేధిస్తూ నాగాలాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిషేధ ఉత్తర్వులు జారీ చేయడానికి చీఫ్ సెక్రటరీ తగిన వ్యక్తి కాదని చెప్పింది హైకోర్టు. ఈ నిషేధాన్ని 2020 నవంబర్ లోనే సింగిల్ బెంచ్ ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదే కేసుపై హైకోర్టు కోహిమా బెంచ్ జస్టిస్ మర్లి వంకున్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. కుక్కల మాంసం విక్రయాల విషయంలో కేబినెట్ నిర్ణయాన్ని కొట్టివేసింది. కోహిమా మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో శునకాలతో వ్యాపారం నిర్వహించే లైసెన్స్ డ్ వర్తకులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు.
ఆహార భద్రత చట్టాన్ని తప్పుగా అన్వయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు హైకోర్టుకు విన్నవించారు. కుక్కల వర్తకంతో పిటిషనర్లు ఆదాయం ఆర్జిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ వారికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేశారు.
నాగాలాండ్‌లో మతం లేదా ఆహారపు అలవాట్లకు సంబంధించిన భారతీయ చట్టాలు విధించబడవు. ఆ రాష్ట్ర ప్రత్యేక హోదా సామాజిక ఆచారాల పరిరక్షణకు హామీ ఇస్తుంది. ఇక్కడి ప్రజలు తరతరాలుగా కుక్క మాంసాన్ని చికిత్సగా కూడా తీసుకుంటారు. ఇదే విషయంపై నాగాలాండ్ యొక్క అపెక్స్ సోషల్ ఆర్గనైజేషన్ నాగ హోహో అధ్యక్షుడు చుబా ఒజుకు స్పందించారు. ఎవరో తినకూడదని భావించిన్నంత మాత్రన మేము ఇప్పుడు తినడం మానేయలేమని చెప్పారు చుబాఒజుకు. ఇక నాగాలాండ్ పరిసర రాష్ట్రాల్లోని అనేక నాగా తెగలతోపాటు మిజోరంలోని కొన్ని వర్గాలలో కుక్క మాంసం రుచికరమైనదిగా భావించి తింటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..