AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగవాళ్లూ మీకో శుభవార్త.. ! ఇకపై ఆర్టీసీ బస్సుల్లో 50శాతం సీట్లు మీ కోసమే.. ఎక్కడంటే..

జూన్ 11న కర్ణాటక వ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రానుంది. దీనికి ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి సానుకూల స్పందన వస్తోంది. కానీ ఆర్టీసీకి మాత్రం నష్టాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. మగాళ్లు మాత్రం డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి..

మగవాళ్లూ మీకో శుభవార్త.. ! ఇకపై ఆర్టీసీ బస్సుల్లో 50శాతం సీట్లు మీ కోసమే.. ఎక్కడంటే..
50 Per Cent Bus Seats
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2023 | 7:29 AM

Share

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు సీట్ల కేటాయింపు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్స్‌, గర్భిణీలు, బాలింతలకు సీట్ల కేటాయింపునిస్తారు. కానీ, పురుషులకు సీట్లు కేటాయించడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..? అది కూడా ఆర్టీసీ బస్సులో సగం సీట్లను వారికే కేటాయించారు. మహిళలు ఎక్కువ సేపు నిల్చోలేరని.. వారిని ఇబ్బంది పెట్టొద్దనేది దీని వెనకున్న ఉద్దేశం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పురుషులకు కూడా బస్సుల్లో 50 శాతం సీట్లను కేటాయిస్తున్నారు. అయితే, ఇది ఎక్కడంటే.. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రావడం కోసం హస్తం పార్టీ ఓటర్లకు అనేక హామీలు గుప్పించింది. తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఏసీ, లగ్జరీ బస్సులను మాత్రం దీని నుంచి మినహాయించింది. జూన్ 11న కర్ణాటక వ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి రానుంది. దీనికి ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి సానుకూల స్పందన వస్తోంది. కానీ ఆర్టీసీకి మాత్రం నష్టాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. మగాళ్లు మాత్రం డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి.. బస్సుల్లో 50 శాతం సీట్లను పురుషులకు కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC), కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KKRTC), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWSRTC) కర్ణాటకలోని మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తాయి. ఈ శక్తి పథకం కోసం కర్ణాటక ప్రభుత్వానికి ఏటా 4,220 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం. నాలుగు ఆర్టీసీలు కూడా 4,028 కొత్త బస్సులను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దాని కోసం 13,793 మంది సిబ్బందిని నియమించుకోవాలి.

ఇకపోతే, మన దగ్గర ఆర్టీసీ బస్సుల్లో సీట్ల వెనుక ఈ సీటు స్త్రీలకు కేటాయించబడింది.. అని రాసినట్లు ఇప్పుడు కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో.. పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చునివ్వండి అంటూ.. స్టిక్కర్లను అతికిస్తారట. బస్సులో పురుషులు లేకుంటే.. ఆ సీట్లు ఖాళీగా ఉంటే మహిళలు వాటిలో కూర్చోవచ్చు. కానీ ఒకవేళ పురుషులు వస్తే మాత్రం ఆ సీటును ఖాళీ చేసి వారిని కూర్చోనివ్వాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.