PM Modi Speech in Parliament Highlights: మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
Parliament No-Confidence Motion Updates Highlights: మూడోరోజు లోక్‌సభలో అవిశ్వాసంపై వాడివేడి చర్చ జరుగుతోంది. లోక్‌సభలో విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చకు గురువారం ఇది మూడో రోజు. ఈ చర్చపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమాధానం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ప్రధాని సభను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. దీనికి ముందు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మణిపూర్ విషయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Parliament No-Confidence Motion Updates Highlights: గురువారం (ఆగస్టు 10) లోక్‌సభలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ప్రధాని సభను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. దీనికి ముందు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మణిపూర్ విషయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం (ఆగస్టు 9) కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్నారు. మోదీ ఇంటిపేరు కేసులో తిరిగి ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ సభలో ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లకపోవడంపై రాహుల్ గాంధీ ప్రశ్నించగా.. మణిపూర్‌ను భారత్‌లో భాగంగా భావించనందునే ప్రధాని అక్కడికి వెళ్లలేదని అన్నారు. మణిపూర్‌ను బీజేపీ విభజించింది.
రాహుల్ గాంధీ సభలో ప్రధాని మోదీ, అదానీల చిత్రాలను చూపించి రావణుడితో పోల్చారు. రావణుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు అనే ఇద్దరు వ్యక్తుల మాటలను మాత్రమే వింటున్నాడని, అలాగే ప్రధాని మోదీ కూడా అమిత్ షా, అదానీల మాటలను మాత్రమే వింటారని రాహుల్ అన్నారు.
హనుమంతుడు లంకను చంపలేదు.. అంటూ రాహుల్‌పై దాడి చేశాడు. రావణుడి దురభిమానంతో లంకా దగ్ధమైంది.రాముడు రావణుని చంపలేదు.. రావణుడి దురభిమానం అతన్ని చంపేసింది, మీరు దేశమంతా కిరోసిన్ పోస్తున్నారు, మీరు దేశం మొత్తాన్ని కాల్చే పనిలో ఉన్నారు. మీరు భారతమాతను చంపుతున్నారు.
రాహుల్ గాంధీ ప్రసంగం ముగిసిన తర్వాత బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ మాత హత్యపై రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు విపక్ష సభ్యులు చప్పట్లు కొట్టారని ఇరానీ అన్నారు. అంతేకాదు, రాహుల్ గాంధీ సభలో టైమ్ ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చారని ఆరోపించారు. ‘ఫ్లయింగ్ కిస్’పై బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
LIVE NEWS & UPDATES
-
మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
లోక్‌సభలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
-
మణిపూర్‌లో త్వరలో శాంతి నెలకొంటోంది
మణిపూర్ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో మాట్లాడారు. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని అన్నారు.
-
-
విపక్షాల వాకౌట్‌ను తప్పుబట్టిన ప్రధాని మోడీ
కాంగ్రెస్‌కు చర్చపై నమ్మకం లేదని విపక్షాల వాకౌట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ తప్పుబట్టారు. మణిపూర్‌పై చర్చిద్దామని హోంమంత్రి చెబితే స్పందించలేదన్నారు. చర్చించేందుకు ధైర్యం కాంగ్రెస్‌కు లేదన్నారు. మణిపూర్ హింసపై అమిత్‌షా రెండు గంటలు మాట్లాడారు. ఏదైతే మనస్సులో ఉంటుందో అదే మాటల్లో వస్తుంది.
-
హైకోర్టు తీర్పు కారణంగా హింస చెలరేగింది
మణిపూర్ హైకోర్టు తీర్పు కారణంగా అక్కడ హింస చెలరేగింది. మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో మణిపూర్‌లో కొత్త సూర్యుడు ఉదయిస్తాడు. దేశమంతా మీ వెంట ఉందని మణిపూర్ ప్రజలకు చెప్తున్నాను. ఈ సభంతా మీ వెంటే ఉంది. ఈ సమస్యకు పరిష్కారం వెదుకుదాం. ఆరోపణలు చేస్తారు.. మాట్లాడుతుంటే వెళ్లిపోతారని మోడీ ఆరోపించారు.
-
కాంగ్రెస్‌ది అబద్దాల దుకాణం- మోడీ
కాంగ్రెస్‌ది అబద్దాల దుకాణం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సైన్యం ఆత్మాభిమానాన్ని కాంగ్రెస్ అమ్మేసిందని విమర్శించారు మోడీ. నేల మీద నడవని వారు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు.
-
-
లోక్‌సభ నుంచి విపక్షాల వాకౌట్
పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తుండగా, లోక్‌సభ నుంచి విపక్షాలు సభను వాకౌట్ చేశారు.
-
ఫెయిల్డ్ ప్రొడక్ట్‌ను పదేపదే లాంచ్ చేస్తున్నారు
ఫెయిల్డ్ ప్రొడక్ట్‌ను పదేపదే లాంచ్ చేస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. కానీ ప్రతీసారి ఆ లాంచింగ్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. వాళ్ల లాంచింగ్ ఫెయిల్ అయితే జనాలపై ద్వేషం పెంచుకుంటారు.
-
కాంగ్రెస్ పార్టీ కష్టాలు నాకు తెలుసు – మోడీ
కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఏమిటో తనకు తెలుసని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా విపక్షాలపై మండిపడ్డారు.
-
Narendra Modi in Parliament LIVE: పేర్ల మీద కాంగ్రెస్‌కు ఉన్న వ్యామోహం ఈనాటికి కాదు
పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. పేర్ల మీద కాంగ్రెస్‌కు ఉన్న వ్యామోహం ఈనాటికి కాదని మండిపడ్డారు. పేర్లు మార్చుకుంటే దేశంలో అధికారం చలాయించవచ్చని అనుకుంటారు. వీళ్ల పేర్లు కనిస్తాయి కానీ, వీళ్ల పని మాత్రం ఎక్కడా కనిపించదు
-
కుటుంబ రాజకీయాలను స్వాతంత్ర్య వీరులు వ్యతిరేకించారు
కుటుంబ రాజకీయాలను మన స్వాతంత్ర్య వీరులు వ్యతిరేకించారని మోడీ అన్నారు. గాంధీ నుంచి అంబేద్కర్ వరకు కుటుఒంబ రాజకీయాలు వద్దన్నారు. కుటుంబ రాజకీయాలు, దర్బారు రాజకీయాలు కాంగ్రెస్‌కు ఇష్టమని మోడీ ఆరోపించారు.
-
ఇది ఇండియా కూటమి కాదు అహంకార కూటమి
కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఇది ఇండియా కూటమి కాదు.. అహంకారుల కూటమి అని అన్నారు. కూటమిలో ఉన్న అందరూ ప్రధాని కావాలనుకుంటారు.
-
వీళ్ల పేర్ల మీద ఎన్నో పథకాలు పెట్టుకున్నారు-మోడీ
వీళ్లు తమ పేర్ల మీద ఎన్నో పథకాలు పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. ఈ పథకాల ద్వారా కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తు నుంచి సిద్దాంతాలు ఏవి వారివి కావు అని అన్నారు. అవన్నీ వేరేవాళ్ల నుంచి తీసుకున్నవే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు A.O హ్యుమ్స్ విదేశీయుడు. అన్ని ఒక కుటుంబం చేతిలో ఉన్నాయని చెబుతోంది కాంగ్రెస్ హస్తం.
-
Narendra Modi Live Today: ఇలాంటి రాజకీయాలు కాంగ్రెస్ బాగా ఇష్టం- మోడీ
కుటుంబ రాజకీయాలు, దర్బారు రాజకీయాలు కాంగ్రెస్‌కు ఇష్టమని ప్రధాని మోడీ అన్నారు. పేర్ల మీద కాంగ్రెస్‌కున్న వ్యామోహం ఈనాటిది కాదన్నారు. పేర్లు మార్చుకుంటే దేశంలో అధికారం చలాయించవచ్చు అనుకుంటారు. వీళ్ల పేర్లు కనిపిస్తాయి. కానీ వీళ్ల పని మాత్రం ఎక్కడా కనిపించదన్నారు.
-
PM Modi in Lok sabha LIVE: ఇండియాను కూడా విడదీశారు
NDAలో రెండు ఐలు చర్చారని, మొదటి ఐ -26 పార్టీల అహంకారం. రెండో ఐ- ఒక కుటుంబానికి అహంకారానికి ప్రతీక అని అన్నారు. ఇండియాను కూడా విడదీశారు. I.N.D.I.A అని మార్చారు అని అన్నారు.
-
Narendra Modi Loksabha LIVE: కాంగ్రెస్‌కు అదే చివరి అధికారం
1988 చివరిసారి కాంగ్రెస్‌కు త్రిపురలో అధికారం దక్కిందని ప్రధాని మోడీ అన్నారు. ఒడిషాలో 28 ఏళ్లుగా కాంగ్రెస్‌ను తిరస్కరించారన్నారు. నాగాలాండ్‌లో 1988లో కాంగ్రెస్ చివరిసారి గెలిచిందన్నారు
-
PM Modi speech LIVE: కాంగ్రెస్‌కు దశాబ్దాల సమయం పట్టింది
దేశంలో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌కు దశాబ్దాల సమయం పట్టిందని మోడీ అన్నారు. 1962లో చివరిసారి తమిళనాడులో కాంగ్రెస్ నిలిచిందన్నారు. యూపీ, బీహార్, గుజరాత్ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారన్నారు.
-
Prime Minister Speech LIVE: ఒడిషాలో 28 ఏళ్లుగా కాంగ్రెస్‌ను తిరస్కరించారు
ఒడిషాలో28 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తూ వస్తున్నారని మోడీ అన్నారు. నాగాలాండ్‌లో 1988లో కాంగ్రెస్ చివరిసారి గెలిచిందన్నారు. కాంగ్రెస్‌పై అన్ని రాష్ట్రాలు నో-కాన్ఫిడెన్స్ ప్రకటించాయన్నారు. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కాంగ్రెస్‌పై నో కాన్ఫిడెన్స్ ప్రకటించాయన్నారు. అహంకారం నిండిన కాంగ్రెస్‌కు నేల కనిపించడం లేదన్నారు.
-
Narendra Modi Speech LIVE: నో కాన్ఫిడెన్స్ నో బాల్, నో బాల్‌గానే సాగింది
ఫీల్డింగ్ చేసింది వాళ్లు, కానీ ఫోర్లు, సిక్సులు ఇక్కడి నుంచి పడ్డాయన్నారు. నో కాన్ఫిడెన్స్ నో బాల్, నో బాల్‌గానే సాగిందని మోడీ అన్నారు. మీరు మాట్లాడిన ప్రతీ మాట దేశంలో ఎంతో శ్రద్దగా విన్నది. మీ ప్రతి మాట దేశాన్ని నిరాశకు గురి చేసింది. వీళ్లు మా లెక్కలు అడుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పేదల ఆకలి వీరికి పట్టదు. వీరికి ఉన్నది అధికార దాహేనని అన్నారు.
-
Narendra Modi in Lok sabha LIVE: ఏంటో మీ దరిద్రం నాకు అర్ధం కావడం లేదు
అవిశ్వాసం తీర్మానంలో భాగంగా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై మండిపడ్డారు. ఏంటో మీ దరిద్రం నాకు అర్థం కావడం లేదన్నారు. పేదల ఆకలి వీరికి పట్టదని, వీరికి ఉన్నది అధికార దాహమేనని అన్నారు. ఈ విశ్వాసం మీద జరిగిన చర్చ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఫీల్డింగ్ చేసింది వాళ్లు, కానీ ఫోర్లు, సిక్సులు ఇక్కడి నుంచి పడ్డాయన్నారు.
-
Narendra Modi in Parliament LIVE: దేశం కంటే సొంత రాజకీయాలకే ప్రాధాన్యం
దేశం కంటే సొంత రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చారని మోడీ అన్నారు. విపక్షం పెట్టిన అవిశ్వాసం మాపై కాదు వాళ్లపైన విశ్వాసం కోసమే. ఐదేళ్ల సమయం ఇచ్చినా మీరు సిద్ధం కాలేదు.
-
Narendra Modi Live Today: జన ఆకాంక్షలను తూట్లు పొడిచారు-మోడీ
విశ్వాస తీర్మానంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై ఫైర్ అయ్యారు. జన ఆకాంక్షలను తూట్లు పొడిచారంటూ దుయ్యబట్టారు.
-
గడిచిన మూడు రోజులుగా అనేక మంది మాట్లాడుతున్నారు- మోడీ
అనేక కీలక బిల్లులు ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టినట్లు చెప్పిన మోడీ.. డిజిటల్ డేటా ప్రొడెక్షన్ బిల్లు దేశ యువతకు సంబంధించినదని అన్నారు. డేటాను సెకండ్ ఆయిల్, సెకండ్ గోల్డ్‌గా భావిస్తున్నారన్నారు. కానీ విపక్షానికి ఇవేవి పట్టలేదు. రాజకీయానికే ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. విశ్వాస తీర్మానంపై గత మూడు రోజులుగా అనేక మంది
-
2024 ఎన్నికల్లో పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి అధికారంలోకి వస్తాం- మోడీ
2024 ఎన్నికల్లో పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి అధికారంలోకి వస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. గడిచిన మూడు రోజులుగా అనేక మంది సభ్యులు మాట్లాడుతున్నారు. అనేక కీలక బిల్లులు ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టామని అన్నారు. డిజిటల్ డేటా ప్రొడెక్షన్ బిల్లు దేశ యువతకు సంబంధించినదని అన్నారు.
-
ప్రతిపక్షాల అవిశ్వాసం మాకు శుభదాయకం- మోడీ
విపక్షం పెట్టిన అవిశ్వాసం మాపై క ఆదు వాళ్లపైన విశ్వాసం కోసమేనని ప్రధాని మోడీ ఆరోపించారు. నాడు జనం వారిని నో కాన్ఫిడెన్స్ చెప్పారు. నాటి ఎన్నికల్లో బీజేపీకి, ఎన్‌డీఏకి సీట్లు పెరిగాయి. ప్రతిపక్షాల అవిశ్వాసం మాకు శుభదాయకం అని అన్నారు.
-
2018లోనూ నాపై అవిశ్వాసం పెట్టారు- మోడీ
మా ప్రభుత్వంపై విశ్వాసముంచిన కోట్లాది మంది ప్రజలకు నా ధన్యవాదాలు. అవిశ్వాసం పెట్టమని దేవుడు ప్రతిపక్షానికి చెప్పి ఉంటారని మోడీ అన్నారు. 2018లోనూ నాపై అవిశ్వాసం ప్రవేశపెట్టారని మోడీ గుర్తు చేశారు.
-
విపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
లోక్‌సభలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇస్తున్నారు. విపక్షాలపై మోడీ ఫైర్ అయ్యారు. మూడు రోజులుగా లోక్‌సబలో అవిశ్వాసంపై చర్చ జరుగుతోంది. లోక్‌సబలో ఇది 28వ అవిశ్వాస తీర్మానం అని అన్నారు.
-
గరీబ్ కల్యాణ్ యోజన కింద బియ్యం ఇస్తే బీఆర్ఎస్ నేతలు అమ్మకున్నారు- బండి సంజయ్
పార్లమెంట్‌లో ఎంపీ బండి సంజయ్ బీఆర్‌ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద బియ్యం ఇస్తే బీఆర్ ఎస్ నేతలు అమ్ముకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ రాలేదని ఆరోపించారు.
-
లోక్‌సభలో తీవ్ర గందరగోళం.. ప్రధానిని నీరవ్‌మోదీతో పోల్చిన అధిర్‌రంజన్
- లోక్‌సభలో తీవ్ర గందరగోళం
- ప్రధానిని నీరవ్‌మోదీతో పోల్చిన అధిర్‌రంజన్
- అధిర్‌రంజన్ కామెంట్స్‌పై బీజేపీ ఎంపీల నిరసన
- అధిర్‌రంజన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
- అధిర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించిన స్పీకర్
లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు హైడ్రామా చోటు చేసుకుంది. మణిపూర్‌పై ప్రధాని మోదీ మౌనం మంచిదికాదన్నారు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్‌రంజన్ చౌదరి. నీరవ్‌మోదీ ఎక్కడో బ్రిటన్‌లో లేడు. ఇక్కడే భారత్‌లో ఉన్నాడని ఆయన నరేంద్రమోదీ అని విమర్శించారు. అధిర్‌రంజన్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు భగ్గుమన్నారు. ప్రధాని మోదీకి అధిర్‌రంజన్ క్షమాపణ చెప్పాలని డిమాడ్ చేశారు
-
ప్రధాని దేవుడు కాదు… – మల్లికార్జున్ ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ప్రధానమంత్రి దేవుడు కాదు? ఆయన వస్తే ఏమవుతుంది? ఆయన దేవుడు కాదు.
-
ప్రధాని మోదీ గంటకు పైగా మాట్లాడతారు – బీజేపీ ఎంపీ సుకాంత్ మజుందార్
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిజెపి ఎంపి సుకాంత్ మజుందార్ మాట్లాడుతూ, “ఈ రోజు పార్లమెంటులో ముఖ్యమైన రోజు, ముఖ్యంగా ప్రతిపక్షాలకు. ప్రధాని మోదీ గంటకు పైగా ప్రసంగించనున్నారు. ఇందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉండాలి.
-
ప్రభుత్వ మనస్సాక్షి ఎక్కడికి పోయింది.. ఒవైసీ
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల ఘటనను ప్రస్తావిస్తూ, మెజారిటీ సమాజంపై తీవ్రవాదం, తీవ్రవాదానికి ఇది ఉదాహరణ కాదా అని AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలా అయితే దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుంది. ప్రభుత్వానికి మనస్సాక్షి ఎక్కడిదని ఒవైసీ అన్నారు.
-
జయలలిత విషయంలో డీఎంకేపై ఆర్థిక మంత్రి దాడి
తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జయలలిత చీర లాగించారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు సభకు వెళ్లనని జయలలిత సభ నుంచి వెళ్లిపోయారు. ఎవరి హయాంలో సభలో ప్రతిపక్ష నాయకుడి చీర లాగేశారో నేడు ద్రౌపది గురించి చెబుతున్నారు అంటూ విమర్శించారు.
-
ఎన్సీపీ, డీఎంకే ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్
అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన సందర్భంగా కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.
-
యూపీఏ దశాబ్దం మొత్తం వృధా చేసింది.. – కేంద్ర ఆర్థిక మంత్రి
అవినీతి, బంధుప్రీతి ఉన్నందున యూపీఏ దశాబ్దం మొత్తం వృధా చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. నేడు ప్రతి సంక్షోభం మరియు కష్టాలు అభివృద్ధి మరియు అవకాశంగా మార్చబడ్డాయి. బ్యాంకింగ్ రంగం ఆరోగ్యంగా ఉండాలని మేము గుర్తించాము. అందుకోసం అనేక చర్యలు తీసుకున్నాము. బ్యాంకులు రాజకీయ జోక్యం లేకుండా పని చేయగలవు, అవి వృత్తిపరమైన చిత్తశుద్ధితో పని చేస్తున్నాయి. బ్యాంకుల్లో విస్తరించిన మీ రైతును మేము శుభ్రం చేస్తున్నాము.
-
మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా..
లోక్ సభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే గందరగోళం మొదలైంది, దీంతో సభా కార్యక్రమాలు 12 గంటలకు వాయిదా పడ్డాయి.
Lok Sabha adjourned till 12 noon, amid sloganeering in the House by Opposition MPs. pic.twitter.com/KTtM9hwOuI
— ANI (@ANI) August 10, 2023
-
రాహుల్ ప్రసంగంలో కొంత భాగాన్ని ఎందుకు తొలగించారంటే..
బుధవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, “అన్‌పార్లమెంటరీగా ఏదైనా మాట్లాడితే, దానిని తొలగిస్తారు, ఇది పాత పద్ధతి. ఇదేమీ కొత్త విషయం కాదు.
#WATCH | On parts of Congress leader Rahul Gandhi’s speech being expunged in Lok Sabha yesterday, Parliamentary Affairs Minister Pralhad Joshi says, “…If anything unparliamentary is said it is expunged & it has been an old practice. This is nothing new…” pic.twitter.com/CcWdJ8F3Ol
— ANI (@ANI) August 10, 2023
-
సభలో ఏదైనా పదం అన్‌పార్లమెంటరీ అయితే..
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. సభలో ఏదైనా పదం అన్‌పార్లమెంటరీ అయితే.. దానిని తొలగించే నిబంధన ఉంది. రాహుల్ గాంధీ ఎలాంటి అన్‌పార్లమెంటరీ పదాన్ని ఉపయోగించారని నేను అనుకోను. భారతమాతను అవమానిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ అంశాన్ని నేను లోక్‌సభ స్పీకర్‌తో ప్రస్తావించగా.. ఆయన పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
#WATCH | Congress MP Adhir Ranjan Chowdhury says, “If a word is unparliamentary there is a provision to remove it. I don’t think so Rahul Gandhi has used any unparliamentary words…Rahul Gandhi said that Bharat Mata is being humiliated… I have taken up this issue with the Lok… pic.twitter.com/VrrOA7Ei3a
— ANI (@ANI) August 10, 2023
-
ప్రారంభమైన సభా కార్యక్రమాలు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటుకు చేరుకున్నారు. సభా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. లోక్‌సభలో విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఇవాళ ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు.
Union Home Minister Amit Shah and Defence Minister Rajnath Singh arrive at the Parliament. pic.twitter.com/LdPRLfVCJO
— ANI (@ANI) August 10, 2023
-
సీనియర్ మంత్రులతో ప్రధాని మోదీ సమావేశం..
నేటి సమావేశాల వ్యూహంపై సీనియర్ మంత్రులతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ సమావేశానికి అమిత్ షా, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి సహా పలువురు సీనియర్ మంత్రులు హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు అవిశ్వాస తీర్మానంపై ప్రధాని సమాధానం ఇవ్వనున్నారు.
Published On - Aug 10,2023 11:11 AM