బలవంతంగా హిందీ మాపై రుద్దొద్దు.. అలా చేస్తే మరో భాషా యుద్ధం తప్పదంటూ దక్షిణాది రాష్ట్రాల వార్నింగ్

మీ హిందీ మాకొద్దు. ఇది ఇండియన్ యూనియన్. ఈ సమాఖ్య స్ఫూర్తి దెబ్బ తీయొద్దు. ఇదీ తాజాగా అమిత్ షా కమిటీ చేసిన హిందీ సిఫార్సులపై దక్షిణాది రాష్ట్రాల వాదన. ఏంటా వన్ నేషన్, వన్ లాంగ్వేజ్ వివాదం..

బలవంతంగా హిందీ మాపై రుద్దొద్దు.. అలా చేస్తే మరో భాషా యుద్ధం తప్పదంటూ దక్షిణాది రాష్ట్రాల వార్నింగ్
Language War
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 13, 2022 | 10:12 AM

ఉత్తర, దక్షిణ భారతాల మధ్య భాషా వివాదం మళ్లీ రాజుకుంది. IIT, NIT, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ మీడియంలో బోధన జరగాలన్న పార్లమెంటరీ కమిటీ సిఫారసులపై తమిళనాడు, కేరళ సీఎంలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్‌తో పాటు హిందీలో కూడా కోర్సులు ఉండాలన్న అమిత్‌షా కమిటీ సిఫారసులను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సైతం తప్పుపట్టారు. ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎందుకు పరీక్షలు నిర్వహించడం లేదని అమిత్‌షాకు ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంగ్లీష్‌, హిందీ భాషలోనే పరీక్షలు నిర్వహించి మాతృభాషలో చదువుకున్న విద్యార్ధులకు కేంద్రం అన్యాయం చేస్తోందని అన్నారు.

ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం.. ఈ అంశంపై స్పందించారు. హిందీని బలవంతంగా రుద్దేందుకు.. బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తమిళ సీఎం స్టాలిన్‌. హిందీ మాట్లాడేవారినే భారతీయ పౌరులుగా, మిగతావారిని రెండో తరగతి పౌరులుగా చూడటం.. దేశాన్ని విభజించడమేనని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో మరోసారి భాషా యుద్ధానికి తెర తీయొద్దని.. కేంద్రాన్ని హెచ్చరించారు స్టాలిన్. రాజ్యాంగం కల్పించిన భిన్నత్వంలో.. ఏకత్వం సిద్ధాంతాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని.. తేల్చి చెప్పారు స్టాలిన్.

బీజేపీ.. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే ఆహారం, ఒకే సంస్కృతిని అమలు చేస్తోందని ఆరోపించారాయన. ఇది.. భారత సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు. హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వార్న్ చేశారు స్టాలిన్. ఇదే సమయంలో ఐఐటీ , ఎన్‌ఐటీ , కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ మీడియాన్ని కేరళ సీఎం విజయన్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం