Panchayat Polls In Himachal: ఓ వైపు కరోనా, మరోవైపు బర్డ్ ఫ్లూ.. హిమాచల్ ప్రదేశ్‌లో మోగిన స్థానిక ఎన్నికల నగారా
హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల నగారా మ్రోగింది. తాజాగా పంచాయతీ రాజ్ సంస్థలకు సార్వత్రిక ఎలక్షన్స్ కు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...
Panchayat Polls In Himachal: హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల నగారా మ్రోగింది. తాజాగా పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయని తెలిపింది. జనవరి 17, 19 , 21 తేదీలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.
ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి, పంచాయతీ సమితి , జిలా పరిషత్ సభ్యుల ఓట్ల లెక్కింపు జనవరి 22 న నిర్వహించనున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ జనవరి 23 లోగా పూర్తవుతుంది. ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు బర్డ్ ఫ్లూ నేపధ్యంలో తగిన జాగ్రత్తలతో ఈ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.