ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాక్టర్ ర్యాలీ, ఇది రిహార్సల్స్ మాత్రమే, 26 న మా తడాఖా చూపుతాం, రైతు సంఘాలు
ఢిల్లీ సరిహద్దులు గురువారం ఎన్నడూ చూడని పరిస్థితిని చూశాయి. కార్గో ట్రక్కులతో నిండి ఉండే సుమారు 135 కి.మీ. దూరం 40 కి పైగా రైతు సంఘాలు
Farmers Protest:ఢిల్లీ సరిహద్దులు గురువారం ఎన్నడూ చూడని పరిస్థితిని చూశాయి. కార్గో ట్రక్కులతో నిండి ఉండే సుమారు 135 కి.మీ. దూరం 40 కి పైగా రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ట్రాలీలతో నిండిపోయింది. . ఘజియాబాద్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పాల్వాల్ వరకు సాగింది. ఢిల్లీ, హర్యానా పోలీసుల మోహరింపు మధ్య ఉదయం 11 గంటలకు రైతులు తమ ట్రాక్టర్ మార్చ్ ను కుండ్లి -మానెసార్-పాల్వాల్ ఎక్స్ ప్రెస్ దిశగా సాగించారు. ఈ నెల 26 న రిపబ్లిక్ దినోత్సవం నాడు ట్రాక్టర్ పరేడ్ ని నిర్వహించాలని రైతు సంఘాలు ఇదివరకే నిర్ణయించాయి. ఆ రోజున ఒక్క హర్యానా నుంచే సుమారు 2,500 ట్రాక్టర్లు ఈ మార్చ్ లో పాల్గొంటాయని అంచనా. ఇక పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి కూడా అన్నదాతలు తమ ట్రాక్టర్లతో రానున్నారు.
थाम तिरंगा हाथों में, वो हक लेने को निकले हैं। सड़कों पर आकर, वो सरकार जगाने निकले हैं।।
ये ट्रैक्टर मार्च अहंकारी भाजपाई सल्तनत को चुनौती है कि किसान हक लिए बिना मानेगा नहीं। pic.twitter.com/HP81YYEJ03
— Congress (@INCIndia) January 7, 2021
Also Read:
అమెరికా అల్లర్లలో భారత జాతీయ పతాకమా ? ఎవరు పట్టుకున్నారు ? అక్కడెందుకుంది ? వరుణ్ గాంధీ ఆగ్రహం