అమెరికా అల్లర్లలో భారత జాతీయ పతాకమా ? ఎవరు పట్టుకున్నారు ? అక్కడెందుకుంది ? వరుణ్ గాంధీ ఆగ్రహం
అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల ఆందోళన సందర్భంగా ఎవరో నిరసనకారుడు భారత జాతీయ పతాకాన్ని పట్టుకున్న ఓ వీడియో హల్చల్ చేస్తోంది..

Indian Flag: అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల ఆందోళన సందర్భంగా ఎవరో నిరసనకారుడు భారత జాతీయ పతాకాన్ని పట్టుకున్న ఓ వీడియో హల్చల్ చేస్తోంది. దీన్ని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పోస్ట్ చేస్తూ…. ఈ మన మువ్వన్నెల పతాకం క్యాపిటల్ బిల్డింగ్ బయట ప్రొటెస్ట్ చేస్తున్నవారిదగ్గర ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ విధమైన ఆందోళనలో మనం పాల్గొంటామా అన్నారు. అసలిది అమెరికా 200 ఏళ్ళ చరిత్రలో ఆ దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. ట్రంప్ మద్దతుదారుల చేతుల్లో ఆ దేశ జాతీయ పతాకాలు, ట్రంప్ చిత్రంతో కూడిన బ్యానర్లు, పోస్టర్లు ఉన్నాయి. అయితే ఇన్ని వేలమందిలో మన ఇండియన్ ఫ్లాగ్ కనబడడం ఆశ్చర్యమే కాక..ఆందోళన కూడా కలిగిస్తోంది. ఆ వ్యక్తి ఎవరు.? ఈ పతాకాన్ని తెలియకుండా పట్టుకున్నాడా, లేక కావాలని తెలిసే పట్టుకున్నాడా అన్నది అర్థం కావడంలేదు.
Why is there an Indian flag there??? This is one fight we definitely don’t need to participate in… pic.twitter.com/1dP2KtgHvf
— Varun Gandhi (@varungandhi80) January 7, 2021
Also Read :
రైతుల ఆందోళన కరోనా వైరస్ వ్యాప్తికి దారి తీయవచ్చు, సుప్రీంకోర్టు ఆందోళన, మర్కజ్ కేసు ప్రస్తావన
నేను గే ను కాను, ట్రాన్స్ జెండర్ గా మారిన బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, ఎందుకంటే ? ఇది నా అభిమతం